జనసేనాని మిడిల్ క్లాస్ ను టార్గెట్ చేశాడు. వారి మనసులను దోచుకోవడం ద్వారా కొత్త ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకోసం చాలానే చేస్తున్నారు. నిజాయతీగా ఉంటే మిడిల్ క్లాస్ ఇష్టపడతారు. పాలిటిక్స్ ప్లే చేస్తే చీ కొడతారు.  అలాగే పెద్దలను గౌరవించే వాళ్ళంటే  లైక్ చేస్తారు. ఫోజు కొడితే మాత్రం దూరం జరుగుతారు.  ఈ లెక్కలు తెలిసిన పవన్  రాముడు మంచి బాలుడు అన్న చందాన వ్యవహరిస్తూ అలా మిడిల్ క్లాస్ ని దారికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు


నేనూ మిడిల్ క్లాసే :


తానూ మిడిల్ క్లాసే అంటూ పవన్ తన మీటింగుల్లో పదే పదే చెప్పడం ఇందుకేనట. రాజకీయాలు మనకెందుకులే అని నేనూ ఊరుకున్నా, కానీ మనమెవరమూ అడగకపోతే ఈ నాయకులు ఇంకా రెచ్చిపోతారు, రేపు మన గోచీ గుడ్డ కూడా లాగేస్తారంటూ ట్రెడిషనల్ లీడర్ల నుంచి తనను వేరు చేస్తూ తెలివిగా మీలో ఒకడినంటున్నాడు. తనకు పదవులు అవసరం లేదని, కానీ సామాన్యుడిగానే ఈ పాలిటిక్స్ ని మార్చాలని వచ్చానని చెప్పుకుంటున్నాడు. అందరం కలిసి ఈ సిస్టం ని మొత్తం మార్చేద్దామని పిలుపు ఇస్తున్నాడు.


ఓటు వేయకపోతే ఆ హక్కు లేదు :


ఓటు వేయడానికీ బద్దకిస్తే లీడర్లు ఇలాగే దోచుకుంటారు, వాళ్ళను అలా వదిలేద్దామా అని పవన్ మిడిల్ క్లాస్ కే ప్రశ్న వేస్తున్నాడు. మనకెందుకీ రాజకీయం అని అనుకోవద్దనీ, అంతా చేతులు కలిపి ముందుకు సాగితే భ్రష్టు పట్టిన వ్యవస్థకు శుభం కార్డ్ పడుతుందని చెబుతూ మధ్య తరగతినే టార్గెట్ చేస్తున్నాడు. దోపిడీ చేస్తున్న వారిని మౌనంగా భరించడం కంటే తరిమి కొట్టాలని కోరుతూనే మీ అందరికీ నేను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాడు.


అలా మార్కులు కొట్టేస్తున్నాడు :


విశాఖ నగరంలోని పెద్దలను కలవడమే కాదు, వారి దీవెనలు కూడా తీసుకుంటూ పవన్ కొత్త రకం పాలిట్రిక్స్ చేస్తున్నాడు. వైజాగ్ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్న మాజీ ఐఏఎస్ అధికారి సీఎస్ రావుని పరామర్శించడం ద్వారా మంచి మార్కులే కొట్టేశాడు. ఉత్తరాంధ్ర సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న సీఎస్ రావు పవన్ ని ఈ ప్రాంత ఇష్యూస్ పై ఉద్యమించాలని సూచించారు. ఇదే తీరున వైజాగ్ సిటీలో పెద్దలను కలవడం పవన్ టూర్లో భాగంగా వుంది. ఇది కచ్చితంగా మిడిల్ క్లాస్ ని అట్రాక్ట్ చేసేదేనంటున్నారు.
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: