టీడీపీ కేంద్రం మీద యుద్ధం తాము మాత్రమే చేస్తున్నామని వైసీపీ , జనసేన భాజపా తో కుమ్మక్కయిందని నిత్యం ప్రజల్లో నూరి పోయడానికే టైం సరిపోయింది. అయితే కేంద్రం మీద పోరాటం సంగతీ మాత్రం చెప్పరు. వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం కాబోలు... అందుకే వారి టైంను ఎక్కువగా రాజకీయ విమర్శలుకే కేటాయిస్తుంటారు. ఇప్పటికీ తెదేపా మంత్రులు సుప్రీంలో కౌంటర్ వేస్తాం అంటున్నారే తప్ప.. నిశ్చయంగా ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు నమ్మించలేకపోతున్నారు.

Image result for chandrababu naidu

ఆంధ్రప్రదేశ్ కు విభజన చట్టం ప్రకారం దక్కవలసిన వాటిలో సమస్తం ఇచ్చేశాం అన్నట్లుగా కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ అఫిడవిట్ లోనూ రెండేళ్ల కిందటి వివరాలతో అసమగ్రంగా పేర్కొన్నట్టు వార్తలు వచ్చాయి. వాటిమీద తెదేపా సర్కార్ అగ్గిమీద గుగ్గిలం అవుతోది. అయితే వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని.. న్యాయస్థానం ద్వారానే కేంద్రం మీద పోరాటం సాగించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Image result for chandrababu naidu

ఇలాంటి నేపథ్యంలో గురువారం మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రం కేంద్రం అఫిడవిట్ కు తాము కౌంటర్ వేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ పని ఈసరికే చేసి ఉండాల్సింది. కేంద్రం అఫిడవిట్ లో ఎలాంటి తప్పుడు వివరాలు ఇచ్చిందనే విషయమై బుధవారమే వార్తలు వచ్చాయి. కేంద్రాన్ని తిట్టడానికి తెదేపా నాయకులు ఉత్సాహపడ్డారే తప్ప, పోరాటాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా యనమల మాటల ఉత్తరకుమార ప్రగల్భాలుగా మిగిలిపోకూడదని.. రోజుల వ్యవధిలోనే.. కేంద్రం చేసిన వంచన ఏమైనా ఉంటే. ఆ వివరాలతో సుప్రీంలో రాష్ట్రప్రభుత్వం అఫిడవిట్ వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: