విశాఖ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు పెద్దాయన టీఎస్సార్ పోటీ చేస్తారా, ఆయననే హస్తం నేతలు బలంగా నమ్ముకున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేల కంటే ఎంపీ సీట్లపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుందట. . కుదిరితే పొత్తుల ఎత్తులతో బరిలో దూకాలని కూడా ప్లాన్ చేస్తోంది. అలా జరిగితే విశాఖ ఎంపీ సీటుకు  టీఎస్సార్ కంటే  బిగ్ ఫిగర్ఎవరూ లేరన్నది నిజం


అలా మిగిలిపొయారు :


నిజానికి విభజన తరువాత కాంగ్రెస్ కు జిల్లాలో పెద్ద తలకాయలు ఎవరూ లేకుండా పోయారు. టీఎస్సార్ కూడా ఒకానొక దశలో పార్టీకి గుడ్ బై చెబుతారని టాక్ నడిచింది. ఆయన వైసీపీలో చేరుతారని అంతా  అనుకున్నారు. అయితే జగన్ నే కాంగ్రెస్ గూటికి రప్పించాలన్నది పెద్దాయన ఆలోచన అని ఆయన సన్నిహితులు అప్పట్లో చెప్పేవారు. ఇందులో ఏదీ జరగలెదు కానీ టీఎస్సార్ మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు. పైగా ఇప్పటి అధ్యక్షుడు రాహులు గాంధీకి కుడి భుజంగా కూడా మారిపోయారు.


దూకమంటే రెడీ :


కాంగ్రెస్ హై కమాండ్ దూకమంటే ఎంపీ ఎన్నికల గోదాలోకి టీఎస్సార్ దూకేస్తారని ఆయన అనుచరులు అంటున్నారు. 2020 వరకూ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఉంది. పోటీ చేసి కాంగ్రెస్ ఉనికిని చాటమని రాహుల్ చెబితే రెడ్డి గారు రెడీ అంటారట. ఓ వైపు టీడీపీతో కాంగ్రెస్ దోస్తీ కడుతుందన్న టాక్ నడుస్తున్న టైం లో టీఎస్సార్ రంగంలోకి దిగితే ఆ ఊపే వేరుగా ఉంటుందంటున్నారు. 


గెలిచేస్తారట :


కాంగ్రెస్ పెద్దల మాట చూస్తే ఎంపీ సీట్లలోనే వారికి  గెలుపు అవకాశాలు ఎక్కువ అని ఆశపడుతున్నారు.  దానికి వారు  చెప్పిన లాజిక్ చూస్తే నమ్మేలాగానే ఉంది. బీజేపీ కేంద్రంలో
ఫెయిల్ అయిందని, అపుడు జనం రెండవ జాతీయ పార్టీగా కాంగ్రెస్ కే చాన్స్ ఇస్తారని, అలా ఎంపీ ఎన్నికలలో అనూహ్యమైన ఫలితాలు వస్తాయంటున్నారు. మరి చూడాలి కాంగ్రెస్ ధీమా ఏంటో.


మరింత సమాచారం తెలుసుకోండి: