ఢిల్లీలోని బురారీ సామూహిక ఆత్మహత్యల కేసులో మిస్టరీ క్రమంగా వీడుతున్నట్టు కనిపిస్తోంది. కేసును దర్యాప్తు చేస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులు ‘గీతా మా’ అనే తాంత్రికురాలిని అదుపులోకి తీసుకున్నారు.  సంచలనం సృష్టించిన ఢిల్లీ బురారీలో జరిగిన సామూహిక ఆత్మహత్యల కేసు రోజుకో అనూహ్యమైన మలుపు తిరుగుతోంది. ఆ 11 మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించింది తానేనని గీతా మాత అనే తాంత్రికురాలు ముందుకొచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్న ఆమె, విచారణ సందర్భంగా వారందరినీ ఆత్మహత్యలు చేసుకోవాలని సూచించినట్టు అంగీకరించింది.
Image result for బురారీ సామూహిక ఆత్మహత్య
11 మందిని ఆత్మహత్యలకు పురిగొల్పింది తానేనని చెబుతున్న గీతా మా వీడియోను శుక్రవారం ‘సీఎన్ఎన్ న్యూస్ 18’ ప్రసారం చేసింది. ‘‘వారిని ఆత్మహత్యల వైపు నడిపించింది నేనే. వారు తమ జీవితాలను ఎలా అంతం చేసుకోవాలో వివరంగా చెప్పా’’ అని అందులో పేర్కొంది.భాటియా ఇంటిని నిర్మించిన కాంట్రాక్టర్ వద్ద పనిచేసిన ఓ ఉద్యోగి కుమార్తే గీతా మాగా అధికారులు గుర్తించారు. అయితే, ఆమె అంగీకారాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. బురారీ ఆత్మహత్యలు ఆదివారం వెలుగులోకి వచ్చి సంచలనమయ్యాయి.
Image result for బురారీ సామూహిక ఆత్మహత్య
పదిమంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఇంటి పెద్దావిడ నారాయణ్ దేవి మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. అటాప్సీ నివేదికలో మాత్రం వారు ఇష్టపూర్వకంగానే ఆత్మహత్యలకు పాల్పడినట్టు తేలింది.  ఇంటి సోదాలలో బయటపడ్డ డైరీలు, సీసీ ఫుటేజీలు పరిశీలించిన తర్వాత ఈ ఆత్మహత్యలు ఓ ప్రణాళిక ప్రకారం జరిగాయనే నిర్ణయానికొచ్చారు పోలీసులు.
Image result for బురారీ సామూహిక ఆత్మహత్య
తాము చనిపోయే సమయానికి చనిపోయిన ఆ కుటుంబ పెద్ద.. లలిత్ తండ్రి ఆత్మ తమని కాపాడుతుందని భ్రమించారు తప్ప నిజానికి ఆత్మహత్య చేసుకోవాలన్నది వారి ఉద్దేశం కాకపోవచ్చని భావిస్తున్నారు. కాగా, గీతా మాను విచారించిన అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: