వైసీపీ జెండా మీద గెలిచి సిగ్గు ఎగ్గు లేకుండా 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లోకి జంప్ అయ్యారు. ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వకుండా ప్రజలను పట్టించుకోకుండా డబ్బు లకు అమ్ముడుపోయిన నాయకుల పరిస్థితి ఇప్పడు ఘోరంగా ఉంది. చంద్ర బాబు నాయుడు వాడుకొని వదిలేసి రకమని తెల్సిన వెళ్లారు. ఇప్పడూ అనుభవిస్తున్నారు. వీరికి తరువాత ఎన్నికల్లో టికెట్స్ కూడా అనుమానమే..!

Image result for janasena

వీరిలో కొంతమందికి హామీలిచ్చి సరిపుచ్చిన బాబు, తెలివైన వాళ్లని డబ్బుతో మభ్యపెట్టారు. వైఎస్ఆర్ పేరు చెప్పి ఓట్లు దండుకున్న వీళ్లంతా, చంద్రబాబు మోసగాడని తెలిసి కూడా పార్టీ మారారు. తీరా ఇప్పుడు టీడీపీ పరిస్థితి చూసి పార్టీ మారినవారంతా అయోమయంలో పడ్డారు. ఇటు చంద్రబాబుని నమ్ముకునే పరిస్థితి లేదు. అవసరం తీరిన తర్వాత బాబు వ్యవహార శైలి ఎలా ఉంటుందో ప్రజలతో పాటు నేతలకూ ఎరుకే. పార్టీ టిక్కెట్టుపై అప్పట్లో చంద్రబాబు వీళ్లందరికీ హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబును నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికే అంతర్గత సర్వేల పేరిట ఎవరెవర్ని దూరం పెట్టాలో అందర్నీ దూరంగా ఉంచిన బాబు, సీట్లపై ఆశలు పెట్టుకోవద్దని పరోక్షంగా చెప్పేశారు. దీంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది జంపింగ్ నేతల పరిస్థితి.

Image result for janasena

పోనీ తిరిగి వైసీపీలోకి వెళ్దామంటే ఒక్కసారి నమ్మక ద్రోహం చేసిన వారిని, వారు ఎంతటి సమర్థులైనా తిరిగి మళ్లీ పార్టీలోకి తీసుకునే రకం కాదు జగన్. సో.. వీరందరికీ ఇప్పుడు ఒకటే ఆప్షన్. అదే జనసేన. వచ్చే ఎన్నికల బరిలో నిలవాలంటే ఈ బ్యాచ్ కు ఇప్పుడు జనసేనే దిక్కు. ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న అపప్రధ ఉంది కాబట్టి బీజేపీలోకి వెళ్లే ఛాన్సే లేదు. అందుకే లిస్ట్ లో ఉన్న 22మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలలో చాలామంది అవకాశం వచ్చినప్పుడు జనసేనలోకి జంప్ చేద్దామని కాచుక్కూర్చున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: