చంద్ర బాబు వ్యక్తులకు విలువ ఇచ్చే రకం కాదని అందరికీ తెలిసిందే. మనుషులను వాడుకొని వదిలేయడం కూడా తెలిసిందే. అయితే నితిన్ గడ్కరీ పోలవరం సందర్సించడానికి వస్తున్నాడు. దీనికి చంద్ర బాబు వెళ్లాలా వద్దా అని మంత్రులతో సమావేశం నిర్వహించాడు. మంత్రుల అభిప్రాయాలను తీసుకున్నాడు.ఒక్కక్కరు ఒక అభిప్రాయాన్ని చెప్పారు.  అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం మెజారిటీ కేబినెట్ సహచరుల మాటకు విలువ ఇచ్చే రీతిలో చిన్న మ్యాజిక్ నడిపించారు.

Image result for chandra babu

తాను వెళ్లాలని కోరుకుంటున్న మంత్రులు  చేతులు ఎత్తాలని చెప్పారు. గంటా, ఆదినారాయణరెడ్డి, అచ్చన్నాయుడు తప్ప అందరూ చేతులు ఎత్తారు. సాధారణంగా ఇలా అందరి అభిప్రాయాలను అడిగినప్పుడు.. మెజారిటీకి విలువ ఇచ్చి నిర్ణయం తీసుకోవాలి. కానీ, చంద్రబాబు చాలా లౌక్యంగా.. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానంటూ ఆ వ్యవహారం ముగించారు. ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకునేట్లయితే మంత్రుల్ని అభిప్రాయం అడగడం ఎందుకు? అనే వాదన వినిపిస్తోంది.

Image result for chandra babu

చంద్రబాబు ఎప్పుడూ తన బుద్ధికి తోచిన మేరకే నిర్ణయం తీసుకుంటారని, కాకపోతే.. దానివలన తేడా వస్తే యితరుల్ని కూడా బాధ్యుల్ని చేసేయడానికి వీలుగా, నామ్ కే వాస్తేగా యితరు అభిప్రాయాలను కూడా తీసుకుంటాడని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే పోలవరం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జాతీయ ప్రాజెక్టు. ఆ పనులకు నిధులు విడుదల చేసేది కేంద్రమే. ఆ నిధులను అందుకుని ఖర్చు పెడుతూ నిర్వహణను పర్యవేక్షిస్తున్న కన్సల్టెంటు పాత్రలో రాష్ట్రప్రభుత్వం ఉంది.  అంటే పోలవరం అనే కాంట్రాక్టుకు రాష్ట్రప్రభుత్వానిది సూపర్ వైజర్ పాత్ర. మరి ప్రాజెక్టు కుడుతున్న కేంద్రంనుంచి మంత్రి వస్తున్నప్పుడు, సూపర్ వైజర్ పాత్రలో ఉన్న ముఖ్యమంత్రి భేషజాలకు పోతే ఎలాగ? పద్ధతి ప్రకారం వెళ్లి తీరాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: