కన్నా లక్ష్మి నారాయణ సీనియర్ నాయకుడు మరియు మాజీ మంత్రి. అయితే కన్నా లక్ష్మి నారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే అయ్యాడు కానీ దాని వల్లన కన్నా కు ఒరిగిందేమి లేదని చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా చెప్పుల దాడి తప్పితే కన్నాకు ఘన స్వాగతాలు. సన్మానాలు ఏమి లేవని చెప్పాలి. ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకోసం భారీగా ఏర్పాట్లు చేసుకున్న కన్నా లక్ష్మినారాయణకు 'ఊహించని విధంగా లక్కీ లాటరీ' తగిలింది. అదే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి.

Image result for kanna lakshmi narayana

కాస్తలో సీన్‌ రివర్స్‌ అయ్యిందిగానీ, లేదంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువా భుజాన వేసుకుని, వైఎస్‌ జగన్‌కి కన్నా లక్ష్మినారాయణ 'జై' కొట్టేసేవారే. రాత్రికి రాత్రి ఈక్వేషన్స్‌ మారిపోయాయి. 200కి పైగా కార్లు.. బోల్డన్ని ద్విచక్రవాహనాలు.. భారీగా ఫైర్‌ వర్క్స్‌, కుప్పలు తెప్పలుగా వైఎస్సార్సీపీ జెండాలు.. ఇవన్నీ వేస్ట్‌ అయిపోయాయి పాపం కన్నా లక్ష్మినారాయణకి. ఇదంతా ఇప్పుడెందుకంటే, వైఎస్సార్సీపీలోకి వెళ్ళాలనుకుని.. బీజేపీలోనే వుండిపోవడం వల్ల 'ఏపీ బీజేపీ అధ్యక్షుడు' అన్న పదవి మినహా, కన్నా లక్ష్మినారాయణకి పొలిటికల్‌గా ఏమాత్రం లాభించలేదని చెప్పడానికే.

Image result for kanna lakshmi narayana

2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే వైఎస్సార్సీపీలో ఆయన చేరి వుంటే, 'పార్టీలో పెద్ద దిక్కు' అనే గౌరవం అయినా ఆయనకు లభించి వుండేదే. కన్నా కోరితే ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఎంపీ టిక్కెట్‌.. పెద్ద విషయం కాదు వైఎస్సార్సీపీలో. బీజేపీ అధ్యక్షుడిగా, 2019 ఎన్నికల్లో కన్నా లక్ష్మినారాయణ చాలామందికి టిక్కెట్లు ఇవ్వొచ్చుగాక.. కానీ, ఏపీలో బీజేపీ పరిస్థితేంటన్నది సీనియర్‌ పొలిటీషియన్‌ అయిన ఆయన అంచనా వేసుకోకపోవడం ఆశ్చర్యకరం. పైగా, బోనస్‌ కింద చెప్పు దెబ్బలు ఎదురవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: