రాష్ట్రం విడిపోయిన తరువాత సర్వేలన్నీ బల్ల గుద్ది చెప్పాయి. జగన్ కాబోయే ముఖ్యమంత్రి అని దానికి తగ్గట్టుగానే అప్పడూ జగన్ కు ఆ రేంజ్ లో వేవ్ ఉన్నది. అయితే చంద్ర బాబు ఈ విషయాన్ని పసిగట్టి మోడీ మరియు పవన్ తో జట్టు కట్టాడు.చివరికి పాదయాత్ర కూడా చేసాడంటే జగన్ అంటే చంద్ర బాబుకు ఎంత భయముందో వేరే చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పడూ ఇదే విషయాన్ని ఏకంగా పవన్ కళ్యాణ్ చంద్ర బాబుకు జగన్ అంటే ఎంత భయమో బయట పెట్టాడు. 

Image result for jagan and chandra babu

 చంద్రబాబు గురించి పవన్ ఓ మాట చెబితే అందులో అంతోఇంతో వాస్తవం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు ఆంతరంగం ఏంటనేది పవన్ కు బాగా తెలుసు. ఈ నాలుగేళ్లలో ఈ ఇద్దరూ అంతలా కలిసిపోయారు. ఇద్దరూ గతంలో ఎన్నో విషయాలపై చాలా క్లోజ్ గా మాట్లాడుకునేవారు. ఇప్పుడు చంద్రబాబుకు ఎదురుతిరిగిన పవన్.. గతంలో బాబుతో ఆంతరంగికంగా మాట్లాడిన కొన్ని విషయాల్ని జనాల ముందుంచుతున్నారు. అందులో ఒకటి చంద్రబాబుకు 'జగన్ ఫోబియా' ఉందనే విషయం. అవును.. బాబుకు జగన్ అంటే విపరీతమైన భయం అనే విషయాన్ని పవన్ బయటపెట్టారు. 

Image result for pawan kalyan

విశాఖలో జరిగిన నిరసన కవాతులో భాగంగా ప్రసంగించిన పవన్.. చంద్రబాబు, తనకు మధ్య ఎప్పుడు భేటీ జరిగినా జగన్ ప్రస్తావన తప్పకుండా వచ్చేదన్నారు. జగన్ పై తనకున్న భయాన్ని బాబు తన కళ్లలో చూపించేవారని, మాటల్లో వ్యక్తపరిచేవారని పవన్ బయటపెట్టారు. జగన్ పై బురదజల్లేలా తన వద్ద చంద్రబాబు చాలా మాటలు మాట్లాడేవారని, అవన్నీ వింటున్నప్పుడు జగన్ స్థానంలో తనకు చంద్రబాబు కనిపించేవారని పవన్ అన్నారు. తను అవినీతి చేస్తూ, జగన్ పై విమర్శలు చేస్తే నవ్వొచ్చేదన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: