చంద్ర బాబు ఒక పక్క పేద రాష్ట్రం అంటాడు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటాడు. ప్రజలే విరాళాలు ఇవ్వాలంటాడు అయితే చంద్ర బాబు  లగ్జరీ జీవితాన్ని మాత్రం వదిలిపెట్టడు. ఏ సీఎం చేయని విధముగా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటాడు అది కూడా ప్రజల సొమ్ము. అయితే మిగతా సీఎం లు నిరాడంబరంగా ఉంటె బాబు మాత్రం దీనికి భిన్నంగా ఉంటాడు. తన కుటుంబం స్టార్‌ హోటళ్లలో ఉండడానికి లక్షల రూపాయలు వ్యయం చేశారు. కృష్ణానది తీరాన ఉన్న అక్రమ కట్టడంలో మళ్లీ కోట్ల వ్యయం.

Image result for ap cm

లేక్‌వ్యూ అతిధిగృహం, విజయవాడలో ఆర్‌అండ్‌బి అతిధిగృహం ఆధునీకరణకు మరిన్ని కోట్ల వ్యయం... ఇలా చెప్పుకుంటూపోతే ఇదేమిటి ఒక ముఖ్యమంత్రి ఇన్ని క్యాంప్‌ ఆఫీస్‌లు కలిగి ఉండడమా? అన్న భావన ఏర్పడుతుంది. అయితే నిబంధనలు అనుమతిస్తాయేమో అని అనుకునేవారం. కాని అజయ్‌ కల్లం చెప్పినదాని ప్రకారం ఇదంతా తప్పిదమే. అంతేకాక, ఈ ఖర్చును వేర్వేరు బిల్లుల కింద తీసుకోవడం, ఆర్ధికశాఖకు రాకుండా ఇతర శాఖల అధికారులు జాగ్రత్తపడతారట. కాంట్రాక్టర్‌ల ద్వారా కొన్ని చెల్లిస్తారట. అంటే అదంతా అవినీతే. ఇక ప్రత్యేక విమానాలకు అవకాశమే తక్కువట.

Image result for ap cm

కాని మన ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో జరిగే పంక్షన్‌లకు కూడా ప్రత్యేక విమానంలోనే వస్తారు. విదేశీయాత్ర చేసినా అదే పరిస్థితి. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ దగ్గరకు గతంలో కేసీఆర్‌ వెళ్లినప్పుడు మామూలు చెక్క కుర్చీలో ఉన్న సంగతి గమనించాం. అంతేకాదు... ఆమె ఢిల్లీలో అద్దె వాహనాలలో వెళతారట. విమానంలో సాధారణ ప్రయాణికురాలి మాదిరే వెళతారట. ఇంత సాధారణ జీవితంలో మమత ఉంటే, మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి అత్యంత విలాస జీవితం గడుపుతున్నారు. రెండువేల కోట్ల రూపాయల వరకు చంద్రబాబు తన విలాసాలకు, పర్యటనలకు, ప్రత్యేక విమానాలకు ఖర్చు చేశారని తమ లెక్కలలో తేలిందని ఆయన చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: