జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర అంటూ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఎన్నికల ముందు ఈ కార్యక్రమం చేపట్టిన విషయం మనకందరికీ తెలిసినదే. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ అధికార పార్టీ తెలుగుదేశం నాయకుల పని ప్రజాప్రతినిధులపై అలాగే ముఖ్యమంత్రిపై విమర్శల వర్షం ఎక్కువగా కురిపిస్తున్నారు.
Image may contain: 1 person, beard
ముఖ్యంగా 2014 ఎన్నికలలో నా మద్దతు తీసుకుని అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నిలువునా మోసం చేశారని బాధపడిపోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తాజాగా  మంత్రి లోకేశ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. లోకేశ్‌ కు దమ్ముంటే తన మంత్రి పదవికి రాజీనామా చేసి…
Image result for lokesh pawan
ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. దొడ్డిదారిన మంత్రి అయినా లోకేష్ ను సీఎం చేయాలని చూస్తే ఊరుకోబోమని పవన్‌ హెచ్చరించారు. లోకేశ్‌ మీద జనసేన తరఫున ఒక కార్యకర్తను నిలబెడతామని, ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్‌ అన్నారు.
Image may contain: 12 people, people smiling, people standing
ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు ఏ సమస్యపైనైనా చర్చించేందుకు తాను సిద్ధమన్న పవన్.. తనతో లోకేశ్‌ బహిరంగ చర్చకు రావాలని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో  జనసేన పార్టీ గెలిచిన ఓడిపోయిన పెద్ద మాటర్ కాదు కానీ కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవనివ నని చాలా ఘాటుగా చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు పవన్.


మరింత సమాచారం తెలుసుకోండి: