బాగా కష్టపడితే గెలుపు ఖాయమంటున్నారు జనసేనాని. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 46 నుంచి 50 వరకు సీట్లలో పార్టీకి మంచి విజయావకాశాలు ఉన్నట్లుగా పవన్ అంచనా వేస్తున్నారు. ఆ సంఖ్యను డబుల్ చేసుకుంటే పవర్ గ్యారంటీ అని పార్టీ శ్రేణులకు జోష్ కలిగించే కబురు చెబుతున్నారు. ఇది ఆ పార్టీ అంతర్గత సర్వేనట. వంద సీట్లు లక్ష్యంగా క్యాడర్ పనిచేయాలని పవన్ గట్టిగా కోరుతున్నారు. 


మూడో పార్టీకే చాన్స్ ?


ఏపీలో టీడీపీకి, వైసీపీకు ఎక్కడా తేడా లేదని పవన్ అంటున్నారు. ఆ రెండు పార్టీలలోను ఉన్న నాయకులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వూరికే బయట విమర్శించుకుంటారు తప్ప లోపల అంతా ఒక్కటేనని పవన్ అంటూ ఈ సంగతే జనాలకు బలంగా చెప్పాలని నాయకులకు డైరెక్షన్ ఇస్తున్నారు. ఏపీలో మూడవ పార్టీగా మనం ఎంత గట్టిగా దూసుకుని పోతే అంత ఎక్కవగా విన్నింగ్ చాన్స్ అని అంచనా వేస్తున్నారు.


మహిళలే టార్గెట్ :


యువత పార్టీకు బాగా ప్లస్ అవుతోందని లెక్కలేసుకుంటున్న జనసేనాని మహిళలను పార్టీ వైపుగా నడిపించాలనుకుంటున్నారు. ఈ కాంబోతో అద్భుతమైన సక్సెస్ దక్కుతుందని భావిస్తున్నారు.  పార్టీలో ఇకపై మహిళా వింగ్ ని బలోపేతం చేయాలని, వారికి కీలక బాధ్యతలు అప్పగించాలని కూడా పవన్ ప్లాన్స్ గా ఉన్నాయి. మహిళా విభాగానికి వీర మహిళ అని పేరు కూడా జనసేన పెట్టేసింది. 


విశాఖలో మహిళా సదస్సు :


తొందరలోనే విశాఖ వేదికగా మహిళా ఆత్మీయ సదస్సుని ఏర్పాటు చేస్తున్నారు. అందులో మహిళలకు సంబంధించి విధాన ప్రకటన పవన్ చేస్తారట. రానున్న ఎన్నికలలో కూడా వారికే ఎక్కువగా టికెట్లు ఇస్తారట. మహిళలను బాగా ప్రోత్సహించడం ద్వారా పటిష్టమైన ఆ వోట్ బ్యాంక్ ని సొంతం చేసుకోవాలని జనసేనాని ఆలోచిస్తున్నట్లు భోగట్టా. మొత్తానికి పాలిట్రిక్స్ని పవన్ బాగానే పట్టేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: