వైయస్ రాజశేఖర్ రెడ్డి పేదవాడు ఉన్నత చదువులు చదవాలి అని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రూపొందించి గుడిసెలలో ఉన్న విద్యార్థులను కళాశాలలో ధనవంతుల పిల్లలు పక్కన కూర్చోబెట్టి చదువుని సమానం చేశారు అని చెప్పటంలో సందేహం లేదు. ఉన్నత చదువులు పేదవాడికి దూరం కాకూడదని రాజశేఖర్ రెడ్డి తీసుకున్న ఆలోచన వల్ల రాష్ట్రంలో చాలామంది ద్వారా వారు ఉన్నత విద్యనభ్యసించి జీవితంలో స్థిరపడి తమ కుటుంబాన్ని ఆర్థికంగా స్థిరపరచి కొన్నవారు వారు చాలా మంది ఉన్నారు.
Image result for chandrababu
అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల వల్ల రాష్ట్రం విడిపోయి మిగిలి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇంజనీరింగ్ ఇంకా మిగతా ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న పేదవారు నాన్న సమస్యలను ఎదుర్కొన్నారు. ఇదిలావుండగా తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు భారీగా పెరిగిపోయాయి.
Image result for chandrababu
ఆర్ధిక స్థోమత లేక పెదలు ఈ కోర్సులకు దూరమవుతున్నారు. ఇక కాలేజీలు మూతపడుతున్నాయి. ఎంసెట్ లో పదివేల లోపు ర్యాంకు సాధించిన వారికి మాత్రమే ఆయా కోర్సుల పూర్తి ఫీజును చెల్లించేలా ప్రభుత్వం నిబంధనలను మార్చింది. పదివేలు దాటి ర్యాంకు వస్తే వారికి 35వేలు మాత్రమే రీయంబర్సుమెంట్ ఇస్తున్నారు. తక్కిన ఫీజుఎక్కువగా ఉండటంతో పిల్లల తల్లితండ్రులపై ఆర్థిక భారం పడుతుంది.
Image result for chandrababu
గతంలో 75వేల లోపు వరకు గరిష్ట ఫీజు ఉండగా ఇప్పుడు దానిని లక్షా పదివేలకు పెంచారు. అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 35వేలు ఇస్తే విద్యార్థి 75వేలు చెల్లించాలన్న మాట. దీంతో తాజాగా వచ్చిన ప్రభుత్వం అమలు చేసిన రూల్స్ పేద వాడిని ఉన్నత విద్యకు మరెంతో దూరం చేశారు...తాజాగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల పేద విద్యార్థులు వారి తల్లిదండ్రులు చాలా బాధపడిపోతున్నారు తమ పిల్లలను చదివించు కోలేక పోతున్నాము అని.


మరింత సమాచారం తెలుసుకోండి: