పవన్ కళ్యాణ్ చిరంజీవి అభిమానులతో సమావేశం అయినా సంగతీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు అభిమానులకు ఒక గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నది. పవన్ కళ్యాణ్ పార్టీ కి సపోర్ట్ చేయమని ఎక్కడ కూడా చిరంజీవి అభిమానులకు చెప్పలేదు .అదేవిధంగా పవన్ పార్టీ గురించి  చిరంజీవి ఏనాడు మాట్లాడింది లేదు. అయితే పవన్ తో జరిగిన మీటింగ్ లో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చినట్టే పవన్ స్వయంగా ఇది ఒక చిరంజీవి అభిమాని పెట్టిన పార్టీ అని చెప్పుకొచ్చాడు. 

Image result for pavan kalyan jansena

సో, ప్రజారాజ్యం పార్టీకి సీక్వెల్‌గా జనసేన పార్టీని అధికారికంగా ఫిక్సయిపోవచ్చు. నిజానికి, చిరంజీవిని రాజకీయాల్లోకి లాగిందే పవన్‌కళ్యాణ్‌. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌ని పక్కనపెట్టి, 'ఇతరులు' ప్రజారాజ్యం పార్టీలో పెత్తనం చెలాయించడంతో.. అన్నయ్య చిరంజీవికి.. పవన్‌కళ్యాణ్‌ రాజకీయంగా దూరమవ్వాల్సి వచ్చింది. అప్పుడు అన్నయ్య పార్టీలో కొంతకాలం తమ్ముడు పనిచేశారు. ఇప్పుడలా కాదు, తమ్ముడి పార్టీలో అన్నయ్య పని చేయడంలేదు. అన్నయ్యను పూర్తిగా సినిమాలకే పరిమితం చేసెయ్యాలని తమ్ముడు డిసైడ్‌ అయిపోవడం గమనార్హం. పదే పదే పవన్‌ అదేమాట చెబుతూ వస్తున్న విషయం విదితమే.

Image result for pavan kalyan jansena

మొత్తమ్మీద, 'అన్నయ్య చిరంజీవి వెంటే ముముంటాం..' అని చెప్పిన నాగబాబు కావొచ్చు, 'చిరంజీవి అనే మహావృక్షం కిందనే మేం పెరిగాం.. ఆయన ఎలా చెబితే అలాగే..' అని చెప్పిన అల్లుఅర్జున్‌ కావొచ్చు.. ఇప్పుడు అందరూ దాదాపుగా పవన్‌కళ్యాణ్‌ 'దార్లోకి' వచ్చేసినట్లే. పవన్‌ తరఫున జనసేన కోసం ప్రచారం చేయడానికి రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌, సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌ తేజ్‌.. ఇలా మెగా కాపౌండ్‌ అంతా రంగంలోకి దిగబోతోంది. ఆ దిశగా ఇప్పటికే సంకేతాలూ పంపేశారనుకోండి.. అది వేరే సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: