తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి...2019 లో ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని  ఏ పార్టీకి ఆ పార్టీ వ్యుహాలని సిద్దం చేసుకుంటున్నాయి ఒక పక్క ముందస్తు కోసం కొన్ని పార్టీలు వేచి చూస్తుంటే మరి కొన్ని మాత్రం ముదస్తూ పేరు చెప్తేనే వణికి పోతున్నాయి..అయితే కేంద్రం మాత్రం ముందస్తు ఎన్నికలకి సర్వం సిద్దం చేస్తోందని తెలుస్తోంది..మోడీ షా లు ముందస్తు ఎన్నికలు వస్తే బిజేపీ తప్పకుండా కేంద్రంలో మరో మారు చక్రం తిప్పచ్చు అని ఆలోచన చేస్తున్నాయి..అయితే

 Image result for telangana ap states

ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే మాత్రం 2018 డిసెంబర్ నెలలో జరుగుతాయి దాంతో ఇంకా ఎన్నికలకి ఆరునెలల సమయం కూడా ఉండదు అయితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మేము మా కార్యకర్తలు నేతలు అందరూ సిద్దంగా ఉన్నారు అంటూ చెప్పడమే కాదు సీఎం కేసీఆర్ తనయుడు ఐటీ శాఖామంత్రి అయితే బహిరంగంగా ముందస్తుకి సిద్దం అంటున్నారు అయితే తెలంగాణలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఆ పార్టీని విజయపధంలో నడిపిస్తుంది అనడంలో సందేం లేదు అంటున్నారు.. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపుకి కీలక పాత్ర పోషించేది ఒక ఒక్క అంశం అదేంటంటే

 Image result for trs congress

తెలంగాణాలో గత ప్రభుత్వాల హయాంలో వేసవిలో నీళ్ళ కొరత అంతాఇంతా కాదు..నల్లా వస్తే చివరకి ఇంట్లోని పాలు గిన్నెలలో కూడా నీళ్ళని పట్టి దాచుకునే వారు అయితే టీఆర్ఎస్ వచ్చిన తరువాత  గోదావరి నీళ్ళని ఇంటింటికి పైపుల ద్వారా అందించడమే కాకుండా ప్రాజెక్ట్ లాలో నీళ్ళు కళకళ లాడుతున్నాయి..అంతేకాదు పురాతన చేరువులని సైతం గోదావరి నీళ్ళతో నింపి గ్రామా గ్రామాలలో నీటి కొరతని తీర్చాడు...ఈ ఒక్క విషయానికి తెలంగాణా ప్రజలు కేసీఆర్ కి బ్రహ్మరధం పడుతున్నారని సర్వేలు కూడా చెప్తున్నాయి..ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కొన్ని నెలల క్రితం వరకూ హడావిడి చేసిన కాంగీ ఇప్పుడు టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది అనేది మాత్రం వాస్తవం...అందుకే ముదస్తుకి ససేమిరా అంటోంది..ఇక బిజేపీ టీఆర్ఎస్ భంధం కూడా తెలగానలో బలపడటంతో టీఆర్ఎస్ గెలుపుకి ఎదురు లేదు అనే టాక్ వచ్చేసింది..

 Image result for janasena ysrcp tdp

ఇక ఏపీ విషయానికి వస్తే అధికార  టీడీపీ ఎన్నికల పేరు చెప్తేనే తెగ టెన్షన్ పడిపోతున్నారు..ఒక పక్క బాబు ముందస్తు కి మేము వ్యతిరేకం అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు కూడా...అయితే తెలంగాణలో అధికార పార్టీకి కలిసోచ్చినట్టుగా ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలుపుకి సాయపడే ఒక్క అంశం కూడా లేదు..ఒక వేళ పెద్దగా చెప్పుకోవాల్సి వస్తే విభజన విషయంలో తెలిపిన నిరసనలు తప్ప మరేమీ కనపడటం లేదు..బిజేపీ తో నాలుగేళ్ళు కలిసి మెలిసి ఉన్న టీడీపీ చివరిలో బిజేపీ తో విభజన గురించే కటీఫ్ అని చెప్పడం అంతా ఒక డ్రామాల ఉండటంతో టీడీపీ ని  నమ్మే పరిస్థితి కనపడలేదు..అమరావతి నిర్మాణం మొదలు మొదలు కాకపోవడం..పోలవరం కనీసం ఒక కొలిక్కి రాకపోవడం తెలుగుదేశాన్ని వచ్చే ఎన్నికల్లో ఓటరుకి దూరం చేసే అవకాశంగా కనిపిస్తున్నాయి...అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో చంద్రబాబు దోస్తీ కడుతారు అనే వస్తున్న వ్యాఖ్యలు సైతం టీడీపీ కి అతిపెద్ద మైనస్ కానున్నాయి.

 Related image

ఇదిలాఉంటే ఒక పక్క ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో దూసుకు పోవడం బిజేపీ సపోర్ట్ మెండుగా ఉండటం అంతేకాకుండా జనసేన సపోర్ట్ భవిష్యత్తులో ఉంటుందనే టాక్ ముఖ్యంగా జగన్ చేస్తున్న పాదయాత్ర ఇవన్నీ జగన్ కి కలిసొచ్చే అంశాలుగా చెప్పవచ్చు..అదే సమయంలో జనసేన చాపకింద నీరులా అన్నచిరంజీవి మద్దతుతో మరింతగా ఏపీలో చొచ్చుకు పోవడం..కాపు ఓటింగ్..కుర్రాళ్ళలో జనసేన పై ఉన్న క్రేజ్ ఇవన్నీ పవన్ కి కలిసొచ్చే అంశాలు అయితే పవన్ టార్గెట్ 50 సీట్లు అని పెట్టుకుని పని చేస్తున్నాడు ఒక వేళ ఆ ఫిగర్ కనుకా రీచ్ ఆయితే మాత్రం ఏపీలో కింగ్ మేకర్ జనసేన అవ్వడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు...ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా చూస్తే..ఏపీలో ముక్కోణ పోరుతో అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుంటే..తెలంగాణలో తమ అభివృద్దే గెలుపుకి బాటలు వేస్తుంది అంటూ కేసీఆర్ ధీమాగా ఉన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: