కేంద్ర మంత్రి గడ్కరీ పోలవరం వస్తున్నారు. రేపు ఆయన అక్కడకు వెళ్ళి జరిగిన పనులను పరిశీలిస్తారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది. ఎంతవరకూ ఖర్చు అయిందీ, ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉంది వంటి లెక్కలన్నీ ఆయనే స్వయంగా చూసి మరీ అసలైన లెక్కలను చెబుతారుట. అంటే నిధుల లెక్కలతో పాటు రాజకీయ లెక్కలను కూడా గడ్కరీ తేల్చేస్తారన్న మాట.


ఇదీ కధ :


పోలవరం జాతీయ ప్రాజెక్ట్. దానికి నూటికి నూరు శాతం కేంద్రం నిధులు ఇవ్వాలి. అయితే 2014 వరకు ఉన్న అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటిస్తూ వచ్చింది. ఇంకోవైపు నాలుగేళ్ళ క్రితం 16 వేల కోట్లు ఉన్న  అంచనా వ్యయం ఒక్కసారిగా మూడు రెట్లు పెరిగిపోయింది. దాంతో ఈ మొత్తం నిజంగా ఖర్చు అవుతుందా, లేక కావాలని పెంచేశారా అన్న అనుమానాలు కేంద్రం వ్యక్తం చేస్తోంది. పైగా నిన్నటి సఖ్యత నేడు లేదు, ఉప్పూ నిప్పులా బీజేపీ, టీడీపీ ఉన్న వేళ గడ్కరీ టూర్ ఇంటెరెస్టింగ్ మాటరే.


విశాఖలో టూర్ :


గడ్కరీ ఈ టూర్లో భాగంగా విశాఖలో రెండు రోజుల పాటు మకాం వేసి అధికారుల స్థాయి మీటింగులతో పాటు, రాజకీయ సమాలోచనలూ జరుపుతారని టాక్.  బీజేపీకి జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన గడ్కరీకి పార్టీ పరిస్థితుల మీద కూడా ఓ అంచనా వుంది. రేపటి ఎన్నికలలో ఏపీలో పార్టీ సంగతి కూడా ఆయన వాకబు చేసి పార్టీ పెద్దలకు తెలియచేస్తారని భోగట్టా. మొత్తానికి అదేదో సినిమాలో పవన్ మాదిరిగా గడ్కరీ టూర్లో అందరి లెక్కలూ తేలుస్తారన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: