అనూహ్యంగా పరిపూర్ణ నంద స్వామీకి  ని నగర బహిష్కరణ చేయడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీనితో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.అయితే సరిగ్గా రెండు రోజుల క్రితం కత్తి మహేష్ ను నగర బహిష్కరణ చేశారు. అయితే కత్తి మహేష్ కేవలం దళితుడు కావడం వల్లనే నగర బహిష్కరణ చేసారంటూ దళిత మద్దతు దారులు వాదించారు. దీనితో దళిత సామజిక వర్గం నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని పనిలో పనిగా పరిపూర్ణ నంద స్వామీ ని కూడా నగర బహిష్కరణ చేశారు. 

Image result for paripurna namda swamy

నిజానికి కత్తి మహేష్‌ బహిష్కరణ నేపథ్యంలో కొన్ని సంఘాలు తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్తున్న వేళ, ఆ బహిష్కరణను త్వరలోనే ఎత్తివేస్తారా.? అన్న చర్చ జరిగింది. వరవరరావు, సంధ్య, దేవి తదితర ప్రజాసంఘాల నేతలు కత్తి మహేష్‌ నగర బహిష్కరణను తీవ్రంగా ఖండించడమే కాదు, ఇది దళితులపై తెలంగాణలో జరుగుతున్న దాడిగా అభివర్ణించేశారు. ఇంతలోనే, పరిపూర్ణానందస్వామి బహిష్కరణ వార్త తెరపైకొచ్చింది.

Image result for paripurna namda swamy

చిత్రమేంటంటే, నగరం నుంచి ఈ ఇద్దర్నీ బహిష్కరించిన పోలీసులు.. ఈ ఇద్దర్నీ ఆంధ్రప్రదేశ్‌కి తరలించడం. ఒకర్ని చిత్తూరు జిల్లాకి, ఇంకొకర్ని తూర్పుగోదావరి జిల్లాకీ పంపించేశారు. మరి, అక్కడ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఇద్దరి విషయంలో ఏం చేస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. అన్నట్టు, కత్తి మహేష్‌ విషయంలో 'దళిత పోటు' నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్‌ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా పరిపూర్ణానందపైనా బహిష్కరణ వేటు వేసిందన్న ప్రచారం జరుగుతోందిప్పుడు. గతంలో రాజాసింగ్‌, ఒవైసీ సోదరులు.. చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ, వారి విషయంలో ఈ 'బహిష్కరణ' అంశం ప్రస్తావనకే రాలేదు. అలాంటిది, కత్తి మహేష్‌ కావొచ్చు.. పరిపూర్ణానంద కావొచ్చు.. ఈ ఇద్దరి విషయంలో తెలంగాణ పోలీసులు ఇంత అత్యుత్సాహం ఎలా చూపారట.? అన్నది సర్వత్రా జరుగుతోన్న చర్చ. ఇంతకీ, ఈ బహిష్కరణలు ఇక్కడితో ఆగుతాయా.? ఇంకా కొనసాగుతాయా.?


మరింత సమాచారం తెలుసుకోండి: