ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ సర్వేల హడావిడి మొదలవుతుంది ఇది ఎక్కడైనా  జరిగే తంతే అయితే ఏపీలో మాత్రం కాస్త వెరైటీ గా జరుగుతోంది..అయితే ఈ సారి సర్వేలు చేయించేది మాత్రం బాబు గారు కాదు బాబు గారి కోటరీలోని మంత్రులు ఏంటి షాక్ తిన్నారా అవును నిజమే.. “టెక్నాలజీ ”  ని ఎలా వాడుకోవాలో...సర్వేలు ఎలా చేయించుకోవాలో తెలిసిన నేతల్లో చంద్రబాబు ఒకరు..ఈ సర్వేల ఆధారంగానే బాబు ఎవరిని ఉంచాలి ఎవరిని సాగనంపాలి ఎవరికి  టిక్కెట్లు ఇవ్వాలో నిర్ణయం తీసుకుంటారు అయితే..సర్వేల బాబుకే తమ సర్వేలతో షాక్ ఇస్తున్నారు ఆ ఇద్దరు మంత్రులు..వివరాలలోకి వెళ్తే..

 Image result for chandrababu

ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో కేవలం పార్టీలు మాత్రమే కాదు నేతలు కూడా పార్టీ కి సంభందిచిన కీలక నేతలు,మంత్రులు సైతం తాము ఏ పార్టీలోకి వెళ్తే మంచిదో ముందుగానే సర్వేలు చేయించుకుంటున్నారు..సర్వేలు చేయడంలో దిట్ట అయిన లగడపాటి కి ఈ భాద్యత ఇద్దరు మంత్రులు అప్పజెప్పారట..అయితే తాము వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుపున పోటీ చేస్తే ఫలితం ఉంటుంది ఏ పార్టీ కి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు అనే కోణంలో ఈ సర్వే సాగనుందని తెలుస్తోంది..అంతేకాదు..ప్రజలు తమని ఏ విషయాలలో వ్యతిరేకిస్తున్నారో కూడా నేతలు తెలుసుకుంటున్నారట..అయితే ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏమిటంటే..

 Image result for election survey

అధికార పార్టీ కి చెందిన ఇద్దరు మంత్రులు తమ ప్రజలు తెలిపిన అసంతృప్తిని..పూర్తి కాని అభివృద్ధి పనులని గురించి ప్రస్తావించగానే సదరు మంత్రులు ఆ పనుల తాలూకు ఫైళ్లని ఆమోదం చేయించుకుని పనులు కూడా ప్రారంభించారట..అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే...ఆ మంత్రుల సర్వేలో ఫైనల్ రిజల్స్ ఏమిటంటే వారు వైసీపిలో కి వెళ్తేనే భవిష్యత్తు ఉంటుందని..అయితే జనసేన పార్టీ లోకి వెళ్ళినా సరే పర్లేదు అన్నట్లుగా చెప్పడంతో సదరు ఇద్దరు మంత్రులు అధికారం ఉండగానే పనులు కానిచ్చేసి చివరిలో పార్టీ చేంజ్ అవ్వచ్చు అనే  లెక్కలు వేస్తున్నారట.

 Image result for chandrababu cabinet meeting

అంతేకాదు ఇప్పటికే ఆ ఇద్దరు మంత్రులు మధ్యవర్తుల సాయంతో వైసీపిలో టచ్ లో ఉన్నారని టాక్ కూడా వినిపిస్తోంది...ఆ ఇద్దరు మంత్రులే కాదు కొంత మంది బడా నేతలు సైతం ఈ సర్వేలని నమ్ముకుని భవిష్యత్తు ప్రణాలికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది..అయితే ఏది ఏమైనా సరే చంద్రబాబు సిద్దాంతాలు చంద్రబాబునే వెన్నుపోటు పోడుస్తున్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.,.సర్వేలు చేయించుకునే బాబుకే సర్వేల ద్వారా బిగ్ షాక్  ఇస్తున్నారు సదరు నేతలు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: