టీడీపీ బయటకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోలోపల మాత్రం జగన్ భయం వెంటాడుతూనే ఉంది.  ఎందుకంటే జగన్ ఏ మేర ప్రభావం చూపించగలడో టిడిపికి బాగా తెలుసు. పోయిన సారి జగన్ కొద్దిలో అధికారం మిస్ చేసుకున్నాడు కానీ లేకపోయుంటే టిడిపి పార్టీ కి చుక్కలు కనిపించేవి. వరుసగా మూడో సారి కూడా ప్రతిపక్షానికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే స్వయంగా లోకేష్ వైసీపీ బలాన్ని ఒప్పుకున్నాడు.

Image result for lokesh

కానీ తెలిసో తెలియకో.. తన అవగాహన లేమిని పలు సందర్భాల్లో బయటపెట్టేసుకుంటూ ఉండే మంత్రి నారా లోకేష్ , గురువారం నాడు తెలుగుదేశం వర్క్ షాప్ లో అలాంటిదే మరో మాట బయటకు వదిలేశారు. ఆయన నేరుగా పేరు ఎత్తి చెప్పకపోయినా.. పరోక్షంగా రాష్ట్రంలో తమ ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ఎంతో బలంగానే ఉన్నదనే విషయాన్ని ఆయన అంగీకరించారు. ఈ సెమినార్ లో లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో అయిదువేల కంటె తక్కువ ఓట్ల తేడాతో జయాపజయాలు తేలే నియోజకవర్గాలే అధికంగా ఉన్నాయని సెలవిచ్చారు.

Image result for lokesh

అయిదువేల కంటె తక్కువ ఓట్ల తేడా మాత్రమే ఉండే నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్నాయంటే.. ప్రత్యర్థి పార్టీ చాలా బలంగా ఉన్నదనే అర్థమే వస్తుంది. అందువలన తమ పార్టీ తరఫున బూత్ స్థాయి నాయకులందరూ చాలా కష్టపడి పనిచేసి.. అ స్వల్పతేడా ఓట్లు తమకే పడేలా చూడాలనేది ఆయన ఉద్దేశం. అందుకు దిశానిర్దేశం చేశారు.తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల నుంచి పాలన సాగిస్తున్నది. దేశంలోనే మేమే నెంబర్ వన్ అని రొమ్ము విరుచుకుని చెప్పుకుంటున్నది.  సంతృప్త స్థాయిలు 98 శాతం వరకు ఉంటున్నాయి... అని టముకు వేసుకుంటూ ఉంటున్నది. ఇన్ని చేస్తున్నా సరే.. కేవలం అంత స్వల్ప వ్యత్యాసం ఉన్న సెగ్మెంట్లు రాష్ట్రంలో దండిగా ఉన్నాయంటే దాని భావం ఏమిటి?



మరింత సమాచారం తెలుసుకోండి: