దేశంలోని ఏ రాష్ట్రంపైనా కోపం కానీ, వివక్ష కానీ మోదీ సర్కార్ చూపదంటూ కెంద్ర మంత్రి గడ్కరి టీడీపీ ఇన్నాళ్ళుగా చెస్తున్న వాదనకు కౌంటర్ ఇచ్చారు. దేశమంతా ఒక్కటి అన్న భావన బీజేపీదని, అటువంటపుడు ఒకరిపైన ప్రేమ, మరొకరిపైన కోపం ఎలా వస్తుందని బాబుకు సెటైర్లు వేశారు. ఒక్క సీటు కూడా లేకపోయినా కేరళలో కేంద్రం అభివ్రుధ్ధి పనులను దివ్యంగా చేస్తోందని, ఆ రాష్ట్రం ఏది అడిగితే అది ఇస్తోందని గడ్కరి అన్నారు. ఏపీలో నిజమైన ప్రగతి బీజేపీ పాలనలోనే జరిగిందన్నారు.


క్రెడిట్ మనదే :


అంధ్ర రాష్ట్రం ఈనాడు ఈ అభివ్రుధ్ధిని చూస్తోందంటే ఆ క్రెడిట్ మొత్తం మోదీకే దక్కుతుందని, దానిని జనాలలోకి తీసుకుపోవాలని గడ్కరీ బీజేపీకి దిశానిర్దేశం చేశారు. మన వాళ్ళు నిజాలు చెప్పాలంటూ, టీడీపీ అసత్య ప్రచారంపైన పరోక్షంగా ఫైర్ అయ్యారు. ఉన్నది చెబితే ఏపేలోనూ బీజేపీ ఉంటుందన్నారు. ఏపీ ప్రజలు ప్రగతిని ఆశిస్తున్నారని, అది మనం చేస్తున్నామంటూ గడ్కరీ  పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని ఇచ్చారు.


సౌత్ టార్గెట్ :


గడ్కరి మాటలను బట్టీ చూస్తుంటే ఈసారి సౌత్ టార్గెట్ గా పెట్టుకున్నారని అర్ధమైపోతోంది. ఇక్కడ ఉన్న 130 ఎంపీ సీట్లలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని గడ్కరి కేడర్ కి సూచించారు. అదే మాట ఆయన వెంట వచ్చిన కేంద్ర మంత్రులు రాధాక్రిష్ణన్, మునుసుఖ్  మాండవ్య కూడా వల్లించారు. తెలుగు రాష్ట్ర్రాలు  ఎంతో కీలకమని, జనంలోకి వెళ్ళి అనుకూల ప్రచారం చెయడం ద్వారా టీడీపీ వాదన తిప్పికొట్టాలని కూడా గడ్కరీ టీం గట్టిగా కోరుతోంది. మొత్తానికి మెత్తగానే అయినా బాబును పంచ్ డైలాగులతో అటాక్ చేస్తూ, క్యాడర్లో ఉత్తేజాన్ని  గడ్కరీ నింపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: