విశాఖ జిల్లాలో టీడీపీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి  అదే పార్టీ లో ఉన్న వారే పొగ పెడుతున్నారట. వచ్చే ఎన్నికలలో ఆయనకు టికెట్ రాకుండా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చల్లగా చేసుకుపోతున్నారట. 2014లో పోటా పోటీ మీద గెలిచినా బండారుకు  మంత్రి పదవి దక్కలేదు. దాంతో నిరాశ చెంది హైకమాండ్ మీద  అలిగారు. అప్పట్లో బాబు విశాఖ వచ్చినా పోలేదు. ఆ సంగతులు ఇపుడు బయటేసి ఆయన టికెట్ కి టిక్కు పెట్టాలని యాంటీ గ్రూప్ రెడీగా ఉందని టాక్. 


ఆయన ఇటువైపే :


విశాఖ రూరల్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న పంచకర్ల రమేష్ బాబు ఈసారి పెందుర్తి నుంచి పోటీకి సై అంటున్నారు. ఆయన కాపు సామాజికవర్గం అక్కడ ఎక్కువగా ఉండడం, 2009 ఎన్నికలలో అక్కడ నుంచి మంచి మెజారిటీతో గెలవడం వంటి వాటిని ద్రుష్టిలో ఉంచుకుని సేఫ్ జోన్ గా భావిస్తున్నారట. ఆయనకు బాబు వద్ధ బాగానె పలుకుబడి ఉండడం, కాపు కార్డ్ కూడా ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. 


ఈ మాజీ కూడానా :


పోయిన ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ తరువాత రోజులలో టీడీపీలో చేరిపోయారు. ఆయనిపుడు పెందుర్తి టికెట్ కోరుతున్నారు. తన అర్ధ బలం, అంగ బలం చూపించి టికెట్ కొట్టేయాలనుకుంటున్నారు. వీరే కాకుండా మరో ముగ్గురు నాయకులు కూడా కర్చీఫ్ వేసేశారు. లక్ తమదేనంటూ ఎవరు మటుకు వారు ధీమాగా ఉన్నారు.


మాస్టర్ ప్లాన్ :


ఈ పోటీకి విరుగుడుగా బండారు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారట. తనకు కాకపోతే తనయుడు అప్పలనాయుడుకు టికెట్ ఇవ్వలంటూ కొత్త ప్రతిపాదనతో బాబును కలుస్తున్నారట. ఇప్పటికే నియోజకవర్గంలో కొడుకుని బాగా తిప్పేస్తున్న బండారు యూత్ కే  టికెట్ అంటే ఇంట్లో నుంచే  క్యాండిడేట్ ను తెచ్చెందుకు ప్రిపేర్ అయిపోయారు. మరి బాబు మార్క్ పాలిట్రిక్స్ లో ఎవరు లక్కెస్ట్ క్యాండిడేట్ అవుతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: