2014 లో జగన్ ను దెబ్బ కొట్టడానికి ప్రతి పక్ష పార్టీ అయినా టీడీపీ బీజేపీ తో చేతులు కలిపింది. అలాగే సినీ నటుడు పవన్ కళ్యాణ్ ను కూడా వాడుకున్నది. అయితే ఆ ఎన్నికల్లో జగన్ పార్టీకి వారికి మధ్య తేడా కేవలం 2 % మాత్రమే. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు. జగన్ మీద వైస్ ఫ్యామిలీ మీద ప్రజలకు ఎంత విశ్వాసం , అభిమానం ఉన్నదో..! అయితే ఇప్పడూ 2019 లో కూడా జగన్ పార్టీ ఒంటరిగానే భరిలోకి దిగుతుంది. ఇప్పడూ కాంగ్రెస్ కూడా జగన్ పార్టీ ని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తుంది. 

Image result for rahul kiran kumar reddy

ఇందులో భాగంగా వ్యూహ‌క‌ర్తగా పేరున్న మాజీ ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్న ఓ వ‌ర్గం మీడియా కోడై కోస్తోంది. కిర‌ణ్ ప్రధానంగా రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కూడా అదే సామాజిక‌వ‌ర్గం నేతే. అందువ‌ల్ల ఆ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మెజార్టీ ప్రజ‌లు స‌హ‌జంగానే వైసీపీ వెంట న‌డుస్తున్నారు. జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంతపార్టీ పెట్టుకున్న మొద‌లు అవిశ్రాంతంగా ప్రజ‌ల మ‌ధ్యనే ఉంటూ వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. ప్రజాస‌మ‌స్యల ప‌రిష్కారానికి త‌నవంతు కృషి చేస్తున్నారు.

Image result for jagan

2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో దిగ్గజాలైన చంద్రబాబు, మోడీతో పాటు ప్రజాక‌ర్షణ నేత ప‌వ‌న్‌తో ఒంట‌రిగా త‌ల‌ప‌డి అధికారానికి కూత‌వేట దూరంలో ఆగిపోవాల్సి వ‌చ్చింది. అయితే వైసీపీని దెబ్బతీయాలంటే రెడ్ల సామాజిక‌వ‌ర్గంలో చీలిక తేవ‌డం కాంగ్రెస్ ప్రధాన ల‌క్ష్యంగా పెట్టుకొంది. ఎందుకంటే మొద‌టి నుంచి కాంగ్రెస్‌కు ఆ సామాజిక‌వ‌ర్గం అండ‌గా నిలుస్తోంది. ఇప్పుడు ఆ సామాజిక‌వ‌ర్గంతో పాటు ఇత‌ర అణ‌గారిన వ‌ర్గాలు జ‌గ‌న్ వెంట న‌డుస్తుండ‌టంతో వారిని త‌మవైపు తిప్పుకుంటే త‌ప్ప బ‌ల‌ప‌డ‌లేమ‌ని కాంగ్రెస్ అధిష్టానం న‌మ్ముతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: