గడ్కరీ గడుసు పిండమే సుమా. మన బాబు కంటే నాలుగాకులు ఎక్కువే చదివారు కూడా. ఏపీకి ఆదుకునేందుకు కేంద్రం సదా సిధ్ధంగా ఉందని చెప్పుకుంటూనే ఏమైన ప్రాజెక్ట్లు ఆగిపోయాయంటే అందుకు బాబు సర్కారే కారణమంటూ చెప్పకుండానే చెప్పేసేంత రాజకీయ తెలివిడి మన గడ్కారీది. ఏపీకి పోర్ట్ ఎందుకు ఇవ్వలేదంటే ఆయన గారి వేళ్ళు టీడీపీ వైపే చూపుతాయి. ఉక్కు ప్లాంట్, పోలవరం ఇలా ఏది అడిగినా టీడీపీనే టార్గెట్ చేస్తున్నారు మన గడ్కరీ.


అలా చేస్తే ఇలా ఇచ్చేస్తారట :


ఏపీకి రెండవ పోర్టు ఇవ్వాలనే ఉందని, తగిన భూమిని రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి ఉంటుందంటూ బంతిని నైస్ గా బాబు కోర్టు లోకే నెట్టేశారు గడ్కరి. దుగరాజపట్నం పోర్ట్ కు అవసరమైన భూమిని చూపించాలంటూ తానే స్వయంగా బాబుకు లేఖ రాస్తానన్నారు. అలాగే పెండింగ్ అన్నది కేంద్రం వద్ద ఎపుడూ ఉండదని, ఇక్కడ అంతా ఓకే అయితే అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడమేనట. 


రోడ్లు మా గొప్పే :


మేము రాక ముందు దేశంలో రోజుకు కేవలం రెండు కిలోమీటర్ల రోడ్లు వేసేవారు. మేము వచ్చాక రోజుకు 28 కిలోమీటర్లు వేస్తున్నాం. ఇది మా గొప్పతనం కాదా అంటున్నారు గడ్కరి రోడ్డు  పడితే అభివ్రుధ్ధి అదే జరుగుతుందనేది కేంద్రం విధానమని, అందుకే ప్రయారిటీ ఇచ్చి మరీ చేపడుతున్నామన్నారు ఒక్క ఏపీలోనే రెండు లక్షల కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మిస్తూ డెవలప్మెంట్ ఇదీ అని చూపిస్తున్నామని బాబుకు రిటార్ట్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: