భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఏపిలో మీడియా మ‌ద్ద‌తు దొరుకుతుందా ? ఇపుడిదే ప్ర‌శ్న అంద‌రినీ వేధిస్తోంది. ఎందుకంటే, బిజెపి జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా మీడియా ప్ర‌ముఖుడు రామోజీరావును క‌లిసిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  ఏకాంగా రామోజీనే క‌లిసారంటే క‌చ్చితంగా రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి మ‌ద్ద‌తు కోసం త‌ప్ప మరే కార‌ణ‌ముంటుంది ? అయితే మీడియా మ‌ద్ద‌తు బిజెపికి దొరుకుతుందా ? అన్న‌దే అంద‌రిలో మొద‌లైన సందేహం. కార‌ణ‌మేమిటంటే రాష్ట్రంలో బిజెపి ప్ర‌స్తుత ప‌రిస్దితే. 


కాంగ్రెస్ బాట‌లోనే బిజెపి ?


రాష్ట్ర విభ‌జ‌న  త‌ర్వాత  జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌నాలు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా బుద్ది చెప్పింది అంద‌రూ చూసిందే. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్ధుల్లో ఏ ఒక్క‌రికీ క‌నీసం డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు.  మెజారిటీ ప్ర‌జ‌ల అభిమ‌తానికి విరుద్ధంగా పైగా అడ్డుగోలుగా రాష్ట్రాన్ని విభ‌జించార‌న్న కోపం జ‌నాల్లో ఉంది. జ‌నాల మ‌నోభావాల‌ను గ్ర‌హించిన టిడిపి, బిజెపిలు ప్ర‌త్యేక‌హోదా, ప్ర‌త్యేక రైల్వేజోన్ లాంటి అనేక అంశాల‌పై ఎన్నో హామీలిచ్చాయి. నిజానికి విభ‌జ‌న పాపంలో బిజెపి, టిడిపికి కూడా భాగ‌స్వామ్యం ఉంద‌న్న విష‌యం మ‌ర‌చిపోకూడ‌దు. 


ఏపిని నిలువునా ముంచిన టిడిపి, బిజెపిలు

Image result for tdp and bjp

సరే పోయిన‌ ఎన్నిక‌ల్లో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వ‌చ్చిన టిడిపి, బిజెపిలు ఏం చేశాయి ? అంటే రాష్ట్రాన్ని నిలువునా ముంచాయి. మొద‌టి నాలుగేళ్ళ పాటు రెండు క‌లిసి ముంచితే ఇపుడు విడివిడిగా రాష్ట్ర ప్ర‌జల‌ను మోసం చేస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపును దృష్టిలోపెట్టుకునే చంద్ర‌బాబునాయుడు బిజెపితో క‌టీఫ్ చెప్పేశార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.  రెండు పార్టీలు క‌లిసున్న మొద‌టి నాలుగేళ్ళ మెజారిటీ మీడియా కూడా వారి మోసాన్ని ఏనాడూ ప్ర‌శ్నించ‌లేదు. వారే పాట పాడితే మీడియాకూ తాన తందానా అంటూ ఆడింది. 


జ‌గ‌న్-రామోజి భేటి 

Image result for ramoji and jagan meeting

గ‌తంలో వైసిపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, రామోజి కూడా భేటీ అయ్యారు. అప్పుడు కూడా రామోజి మ‌ద్ద‌తు కోస‌మే జ‌గ‌న్ క‌లిసార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. మ‌రి, జ‌గ‌న్ ఆశించిన‌ట్లుగా రామోజి మ‌ద్ద‌తు ఇచ్చిందా ? అంటే అనుమాన‌మే.  రాష్ట్రంలోని మెజారిటీ మీడియా చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా మ‌రో పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌ద‌న్న విష‌యంలో అనుమాన‌మే అవ‌స‌రం లేదు.

రంగంలోకి దిగిన జాతీయ నాయ‌క‌త్వం

Image result for ramojirao and amitshah

ఎప్పుడైతే టిడిపి, బిజెపిలు విడిపోయాయో అప్ప‌టి నుండి క‌మలంపార్టీకి అప్ప‌టి నుండి క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. బిజెపి నేత‌ల‌పైనే టిడిపి శ్రేణులు ఏకంగా భౌతిక దాడుల‌కే దిగుతున్న విష‌యం అంద‌రూ చూస్తున్న‌దే. జ‌రుగుతున్న దాడులే మీడియాలో హైలైట్ అవుతున్నాయి కానీ త‌ర్వాత బిజెపి నేత‌ల వాద‌న పెద్ద‌గా రావ‌టం లేదు. మీడియా స‌మావేశాల్లో కూడా చంద్ర‌బాబుపై బిజెపి నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు కూడా ఏదో మొహ‌మాటానికి ఇస్తున్నారంతే. రేప‌టి రోజున ఎన్నిక‌ల హీట్ పెరిగిపోతే ఈ మాత్రం వాయిస్ కూడా మీడియాలో విన‌బ‌డేది అనుమాన‌మే. అందుక‌నే జ‌రుగుతున్న విష‌యాల‌ను భేరీజు వేసుకున్న బిజెపి జాతీయ నాయ‌క‌త్వం మీడియా మ‌ద్ద‌తు కోసం  స్వ‌యంగా రంగంలోకి దిగినట్లు అర్ద‌మ‌వుతోంది. 


మ‌ద్ద‌తు కోసం బిజెపి పాకులాట‌

Related image

రాష్ట్రంలోని మెజారిటీ మీడియా చంద్ర‌బాబు చెప్పుచేత‌ల్లో ఉంద‌న్న విష‌య అంద‌రికీ తెలిసిందే. చంద్ర‌బాబుతో క‌లిసుంది కాబట్టి మెజారిటీ మీడియా బిజెపిని కూడా మోసింది. ఎప్పుడైతే చంద్ర‌బాబు-బిజెపిలు విడిపోయాయో అప్ప‌టి నుండే బిజెపికి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు, వార్త‌లు మొద‌ల‌య్యాయి.  టిడిపిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కించాలంటే బిజెపిని బూచిగా చూపాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబు మీడియాకు ఉంది. ఇపుడ‌దే  జ‌రుగుతోంది. ఇటువంటి నేప‌ధ్యంలోనే అమిత్ షా రామోజీని క‌ల‌వ‌టం గ‌మ‌నార్హం. రెండు రాష్ట్రాల్లోను మీడియా మ‌ద్ద‌తు కోరే ఉద్దేశ్యంతోనే భేటీ అయ్యుంటార‌న‌టంలో  సందేహం లేదు. తెలంగాణా వ‌ర‌కూ మ‌ద్ద‌తు ఇవ్వ‌టంలో రామోజికి అభ్యంత‌రాలుండ‌క పోవచ్చు. అదికూడా టిడిపి-కాంగ్రెస్ పొత్తులుండ‌క‌పోతేనే.  మ‌రి, ఏపి విష‌యంలోనే ......


మరింత సమాచారం తెలుసుకోండి: