ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఒక సంచలనం అనే చెప్పాలి..జనసేన పార్టీ అధ్యక్షుడిగా కంటే కూడా ప్రజా సమస్యలని తనదైన శైలిలో ప్రభుత్వాలని వినిపించే ఒక విప్లవ నాయకుడిగానే కనిపిస్తారు పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్  తన పంధాని పూర్తిగా మార్చుకున్నారు ఇప్పుడు తానొక సంచలనమే..అందుకే ఏపీలో అధికార పార్టీ ,ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా పవన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి..అయితే ఈ క్రమంలో పవన్ ఉత్తరాంధ్ర పర్యటన జనసేన్ పార్టీకి మంచి మైలేజ్ తీసుకు వచ్చింది ఈ పర్యటన ముగుంచుకున్న పవన్ కళ్యాణ్ మరి యాత్ర తూర్పు గోదావరి జిల్లా కి సిద్దం అయ్యారు అయితే.

 Related image

పవన్ కళ్యాణ్ ఈ తూర్పు పర్యటనలో భాగంగా పోలీస్ పర్మిషన్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు అయితే పవన్ షెడ్యులు ప్రకారం జగన్ యాత్ర ఉండటంతో జగన్ వెళ్ళే వరకూ కూడా ఆగాల్సిందిగా పవన కి సూచించారు పోలీసులు దీంతో పవన్  ఈ నెల 22 నుంచి తన యాత్రను తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించబోతున్నారు. టీడీపీ కి కంచుకోటలాగా ఉన్నా గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటన ఎలా సాగబోతోంది అనే ఉత్కంట అందరిలో నెలకొంది.. ముఖ్యంగా గోదావరి జిల్లాలని  గత ఎన్నికల్లో కంచుకోటలుగా మలుచుకున్న అధికార తెలుగు  దేశం పార్టీకి పవన్ పర్యటన తో ముర్చెమాటలు పట్టిస్తోంది..ఎందుకంటే పవన్ సామజిక వర్గం కి చెందిన కాపులు ఈ రెండు జిల్లాల్లో అధికంగా ఉన్నారు ఇదే ఇప్పుడు బాబు కి బెంగ కలిగిస్తోంది అంటున్నారు..అయితే

 Image result for janasena pavan kalyan speech .

అయితే ఉత్తరాంధ్ర పర్యటనలో ప్రత్యేక ఉత్తరాంధ్ర అంటూ నినదించి ఒక్క సారిగా రాజకీయ వర్గాలని షేక్ చేసిన పవన్ గోదావరి జిల్లాలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అని ఆసక్తి నెలకొంది...అయితే పవన్ తూర్పు పర్యటనలో ఒక కీలక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుదని అంటున్నాయి జనసేన వర్గాలు అది అభ్యర్ధుల ప్రకటన అని కొంతమంది అంటున్నారు ఎందుకంటే తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లా అందులోనే సొంత జిల్లా కావడంతో ఇద్దరు అభ్యర్ధులని ప్రకటిస్తే పార్టీ కార్యకర్తల్లో జోష్ ఉంటుంది అని భావిస్తున్నారని ఒక టాక్ వినిపిస్తోంది అయితే మరొక

 Image result for janasena pavan kalyan speech .

 విషయం ఏమిటంటే..ఉభయ గోదావరి జిల్లాలో జిల్లాకి ఒక్క రైతుకి టిక్కెట్టు ఇచ్చేలా గతంలోనే ప్లాన్ చేసిన పవన్ ఇప్పుడు ఈ పర్యటనలో ఈ ప్రకటన చేసి ఒక కొత్త వోరవాడికి శ్రీకారం చుట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది..అంతేకాదు రైతులని సంఘటితం చేసి ఈ గోదావరి జిల్లా యాత్రలు అవ్వగానే రైతు ఉద్యమం మొదలు పెడుతాను అనే ప్రకటన అయినా వస్తుందని టాక్ వినిపిస్తోంది ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ తప్పకుండా ఎదో ఒక కీలక ప్రకటన ఈ పర్యటనలలో ఉంటుదని ఎదురు చూస్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: