నాలుగేళ్ళు ఎంచక్కా కాపురం చేసిన టీడీపీ తూచ్ అనేసింది. ఏపీ బీజేపీకి ఇపుడు చుక్కలు కనిపిస్తున్నాయి. డిల్లీ వాళ్ళకు బాబు బదులు వేరే దోస్తీ దొరకచ్చేమో కానీ మా సంగతేంటని ఏపీ నేతలు దిగాలు పడుతున్నారు. పోయిన ఎన్నికలలో పొత్తు పెట్టుకుని పదవులు పొందిన నాయకులకు తాజా పరిణామాలు బేజారెత్తిస్తున్నాయి. బీజేపీకి ఇక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన విశాఖలో ఇపుడు కాషాయం పార్టీ కలవరం చెందుతోంది.


ఆయన సరే, మరి ఈయనేంటి :


పొత్తును పూర్తిగా వాడేసున్న నాయకులలో హరిబాబు ముందు వరసలో ఉంటారు. ఆయన ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా టీడీపీ చలువతోనే. ఆ అభిమానం ఆయనలో నిండుగానే ఉంది. అయితే తాజా  పరిస్థితి చూసిన ఆయన వచ్చే ఎన్నికలలో పోటీకి దూరమంటున్నారు. చేసింది చాలు, మళ్ళీ ఏమైనా లక్కీ చాన్స్ వస్తే అపుడు చూసుకుందామనుకుంటున్నారు. మరి అదే విశాఖలో బీజేపీ  శాసనసభా పక్ష నాయకునిగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఆయన మళ్ళీ పోటీ చేసి తీరుతానంటున్నారు.


అటువైపేనా :


రాజు గారు సైకిలెక్కుతారని గత కొన్నాళ్ళుగా కొన్నాళ్ళుగా టాక్ నడుస్తోంది. దానికి తగినట్లే రాజు గారి అడుగులూ పడుతున్నాయి. అన్న క్యాంటీన్ల ఓపెనింగులో రాజు గారిదే హడావుడి. బాబు విశాఖ వస్తే చాలు పక్కనే వాలిపోతున్నారు. టీడీపీ మంచి పనులు చేస్తోందని సర్టిఫికేట్లూ ఇస్తున్నారు. చూస్తుంటే ఆయన పసుపు తీర్ధం పుచ్చుకునేలా ఉందని అంటున్నారు.


ఇంతే సంగతులా :


పోయినసారి మోడీ గాలి బలంగా వీచి విశాఖ బీజేపీకి జై అంది. ఆ ఊపులో రాజుగారు వైసీపీని ఓడించి మరీ  గెలిచేశారు. అలాగే హరిబాబు కూడా అనూహ్యంగా ఎంపీ అయిపోయారు.  నాలుగేళ్ళూ ఈ నాయకులు  టీడీపీ చంకనెక్కి ఊరేగడం తప్పించి సొంత పార్టీని బలోపేతం చేసింది లేదు. తీరా బాబు హ్యాండ్ ఇచ్చాక గానీ తామెక్కడున్నామో తెలియలేదు. ఇపుడు కూడా పార్టీని నిలబెట్టేందుకు చూడకుండా పక్క చూపులు చూడడంపైనే క్యాడర్ మండిపడుతోంది. ఈ పరిణామాలతో బీజేపీకి చివరకు ఏం మిగిలిందని గుస్సా అవుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: