తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ లో శాంతియుత వాతావరణం కోసం ఆయన పోలీస్ శాఖను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.  ఏ పండుగలు వచ్చినా..ముఖ్య కార్యక్రమాలు అయినా పోలీస్ భద్రతా వలయంలో జరుగుతున్నాయి.  అందుకే నాలుగు సంవత్సరాలు అవుతున్నా..ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.  ఇదిలా ఉంటే ఈ మద్య సినీ క్రిటిక్ కత్తి మహేష్ హిందువుల ఆరాధ్యదైవం అయిన శ్రీరాముడు, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 
Image result for kathi mahesh
దాంతో హింధువుల మనోభావాలు దెబ్బతిన్నాయి..ఒక్కసారే కత్తికి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యారు.  కత్తి మాట్లాడిన మాటలు ఒక వ్యక్తిని కాదు కోట్ల మంది వ్యక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని..ప్రభుత్వం అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 
Image result for kathi mahesh
ఈ నేపథ్యంలో కత్తి మహేష్ పై ఆరు నెలల నగర బహిష్కరణ చేశారు.  కత్తి మహేశ్‌ వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైన ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు నగరం నుంచి బహిష్కరించిన సంగతి విదితమే. వీరిద్దరి బహిష్కరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు వచ్చాయి. వాగా కత్తి, పరిపూర్ణానంద బహిష్కరణను ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థించుకున్నారు. 
Image result for kathi mahesh
గవర్నర్ నరసంహన్‌తో భేటీ అయిన కేసీఆర్ వారిద్దరిపై వేటుకు గల కారణాలను వివరించారు. శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. వారిపై వేటు వేయడానికి అదే కారణమన్నారు. కాగా, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను నిరసిస్తూ బీజేపీ నేతలు శనివారం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం నరసింహన్‌తో సీఎం భేటీ అయ్యారు. పలు విషయాలను వివరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: