ఎన్నికల సమరానికి వైసీపీ సర్వసన్నధ్ధమవుతోంది. అందులో భాగంగా పార్టీ అభ్యర్ధుల ఎంపికను ఆచీ తూచీ చేస్తోంది. ఉత్తరాంధ్రలో కీలకమైన అరకు ఎస్టీ పార్లమెంట్ సీటుకు వైసీపీ తరఫున పోటీ చేయడానికి జగన్ ఆయన పేరు అనుకుంటున్నారట. గట్టి క్యాండిడేట్ నే బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారుట. ఆయనైతే విజయం డ్యాం ష్యూర్ అనుకుంటున్నారుట.


బెస్ట్ చాయిసే :


వైసీపీకి ఉత్తరాంధ్రలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినా ఇపుడు మిగిలింది అయిదుగురే. అందులో కూడా సీనియర్ ఆ ఎమ్మెల్యే. విజయనగరం జిల్లా సాలూరు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న పీడిక రాజన్న దొర వైఎస్ కి అచ్చమైన భక్తుడు. ఆయన చనిపోయాక జగన్ పార్టీలో చేరి అండగా ఉంటున్నారు. మధ్యలో టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా తొణకని బెణకని నైజం ఆయనది. నీతి, నిజాయతి కలిగిన ఆయనంటే గిరిజనులకు ఎంతో అభిమానం. 


విక్టరీ ష్యూర్ :


జగన్ సైతం రాజన్న  దొర అంటే బాగా లైక్ చేస్తారు. పార్టీ కోసం అలా మిగిలిపోయిన నాయకునిగా రెస్పెక్ట్ ఇస్తారు. అందుకే ఈసారి లోక్ సభకు ఆయనను పంపాలని జగన్ అనుకుంటున్నారు. అయిదు జిల్లాల పరిధిలో ఉన్న అరకు ఎంపీ సీటు గెలవాలంటే రాజన్న దొర సరైన అభ్యర్ధి అని జగన్ భావిస్తున్నారుట. గతసారి కూడా అరకు సీటుని వైసీపీ గెలుచుకోవడం వెనక రాజన్న దొర  క్రుషి కూడా వుందట.


మనసు అటువైపు :


ట్విస్ట్ ఏంటంటే రాజన్న దొర ఈ విషయంలో హై కమాండ్ వైఖరికి భిన్నంగా రియాక్ట్ అవుతున్నారని టాక్. తనకు సాలూరు ప్రజలే ప్రాణమని, మరో మారు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాను తప్ప ఎంపీ బరిలో నిలవనని ఆయన అంటున్నట్లు భోగట్టా. అరకు ఎంపీ సీటు ఎవరికి ఇచ్చినా తన వంతుగా క్రుషి చేసి గెలిపించి తీసుకువస్తానని గట్టిగా చెబుతున్నారుట. మరి జగన్ ఏమంటారో చూడాలి.
 



మరింత సమాచారం తెలుసుకోండి: