ఎంతో ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వరస మారుతోందా. వెంకన్న స్వామి సొమ్ము తింటూ ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా తరచూ టీటీడీ వ్యవహరిస్తోంది. ఫలితంగా భక్తుల మనో భావాలు దెబ్బ తింటున్నాయి. మొన్నటికి మొన్న స్వామి వారి అభరణాల గురించి జరిగిన రచ్చ గుర్తుండే ఉంటుంది. అది అలా ఉండగానే ఇపుడు మహా సంప్రోక్షణ పేరిట మరో వివాదం రాజుకుంది. భక్తులనే ఆలయానికి రావద్దనడం ఎంతటి అపచారం ?


భక్తులనే దూరం చేసే వ్యూహం :


ప్రపంచ ప్రసిధ్ధి చెందిన వెంకన్న ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ప్రతీ రోజూ అక్కడ రద్దీగానే ఉంటుంది. అటువంటిది ఏకంగా ఆరు రోజుల పాటు స్వామిని చూడనీయమంటే ఎలా. ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటపుడు ఆస్తికుల మనోభావాలు గురించి టీటీడీ కనీసం ఆలోచన చేయదా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఇది నిజంగా భక్తులను ఆ స్వామికి దూరం చేయడమే 


పండితుల కంటే గొప్పవారా :


ఏదో రాజకీయ పలుకుబడితో టీటీడీలో కుర్చీ సంపాధించిన వారు, చదువుకుని అధికారులుగా నియమించబడిన వారు తామే గొప్ప అని భావించవచ్చు గాక. కానీ ప్రతి ఆలయానికీ ఆగమ శాస్త్రం ప్రకారం కొన్ని విధి విధానాలు ఉంటాయి. వాటిని పాటించాల్సిన బాధ్యత అక్కడ పెద్దలపైన ఉంటుంది. టీటీడీ పెద్దలు మాత్రం తామే పెద్దగా భావిస్తున్నారు. అందుకే ఇలా తరచూ టీటీడీ వివాదమవుతోంది.  


ఆ భయం ఉందా :


చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే పధ్ధతి గురించి ఎవరు చెప్పినా వెంకన్నను చూపించి భయపెడుతున్నారు. స్వామి జోలికి రావద్దంటున్నారు. మరి అదే స్వామికి అపచారం చేస్తే టీటీడీ మాత్రం మిగిలిఉంటుందా ?   తరచూ మన సీఎం బాబు అంటూంటారు. వెంకన్నతో పెట్టుకుంటే అంతే సంగతులని, మరి ఆయన గారు నియమించిన టీటీడీ బోర్డ్ కు ఆ భయం ఉండొద్దా, అంతా నా ఇష్టం అని వారు తెగించి నిర్ణయాలు తీసుకోవచ్చా. బాబు సర్కార్ సైతం వాటిని చూసీ చూడనట్లుగా వదిలేయవచ్చా. వీటికి సమాధానాలు చెప్పాలంటే ఆ దేవుడే దిగి రావాలేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: