వైకాపా నేతల మాటలు వింటే  నిజంగా వీరికి మతి భ్రమించిందా అని సందేహం రాక మానదు. ఒక పక్క టీడీపీ వైసీపీ తో బీజేపీ కుమ్మక్కయిందని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని పదే పదే చెప్పి జనాల్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి తోడు వైసీపీ సీనియర్ నేతలు చేస్తున్నా వ్యాఖ్యలు లేని పోనీ తల నొప్పులు తెచ్చి పెడుతుంది. భాజపాను మాత్రం రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరూ విలన్ గా నమ్ముతున్న నేపథ్యంలో, వారితో మైత్రికి తహతహలాడుతున్నట్లు ప్రజలు నమ్మితే.. అది ఖచ్చితంగా వైకాపాకు చేటు చేస్తుంది.

Image result for botsa satyanarayana

‘నిరాధార ఆరోపణలపై స్పందించడం మంచిది కాదు’ అనే అభిప్రాయంతో జగన్ నేరుగా ఇలాంటి ఆరోపణలను పట్టించుకోవడం లేదు. కానీ, పార్టీలో తర్వాతి స్థాయి నాయకులు మాత్రం.. పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారు. ఒకవైపు తెలుగుదేశం ప్రచారానికి గట్టికౌంటర్ అనిపించేలాగా, పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి భాజపాతో పొత్తు పెట్టుకోవడమే జరిగితే తాను పార్టీకి రాజీనామా చేస్తానని.. జగన్ అలా చేయరనే నమ్మకంతోనే ఈ మాట చెబుతున్నానని అంటున్నారు.

Image result for pardha saaradhi

అదే సమయంలో.. బొత్స సత్యానారాయణ మాత్రం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తాం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బొత్స మాటలు పార్టీకి నష్టం చేసేవే. అసలే తెదేపా విషప్రచారం శ్రుతి మించుతున్న వేళ ఇలాంటి మాటలు తగవు. రాష్ట్రం కోసం ఎవరితోనైనా కలుస్తాం అన్న తరువాత.. భాజపాతో పోరాడుతాం.. అనేమాటలు చెప్పినా కూడా ప్రజల తలకెక్కవు. పార్టీ నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటనలతో పార్టీకి చేటు చేయకుండా.. అధినేత జగన్మోహన రెడ్డి జాగ్రత్త తీసుకోవాలని పార్టీ శ్రేణులు, అభిమానులు కోరుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: