అదేంటో టీడీపీలో బొత్తిగా డిసిప్లిన్ అన్నదే లేకుండా పోతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ స్టాండ్ ఏంటన్నది ఎవరికీ అర్ధం కాకుండా పోతోంది. ఎవరేం మాట్లాడుతున్నారో అసలు అర్ధం కావడం లేదు. ఈ మధ్యన బీజేపీ ఫైర్  బ్రాండ్  సోము వీర్రాజు అన్నట్లు ప్రభుత్వంతో పాటు పార్టీ మీదా బాబు పట్టు తప్పారేమో అనిపిస్తోంది. ఇందుకు అచ్చమైన ఉదాహరణ ఈ రోజు మాజీ మంత్రి పీతల సుజాత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరు గ్రామంలో చేసిన వ్యాఖ్యలు.


 చినబాబే పెదబాబు :


పెనమంట్ర మండలం నెలమూరులో ఈ రోజు జరిగిన గ్రామదర్శిని మీటింగులో మాట్లాడిన పీతల సుజాత లోకేష్ ని కాబోయే సీఎం గా పేర్కొన్నారు. రేపటి రోజున మన ముఖ్యమంత్రి ఈయనేంటూ గ్రామస్తులకు కొత్త పరిచయం కూడా చేసేశారు. మరి ఆయన తండ్రి, టీడీపీ అధినాయకుడు చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతారంట. జాతీయ రాజకీయాలకు వెళ్తారంట. ఈ మాటలు ఎంతో తీయగా అనిపించాయి కాబోలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు ముఖ్య అతిథి లోకేష్ బాబు. 


తెలిసే జరుగుతోందా :


ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతోందా అంటే కాదనే చెప్పాలి. నలభయ్యేళ్ళు రాజకీయాలలో తల పండిన పెద్దాయనకు రేపటి రోజున ఇక్కడ ఏం జరుగుతుందో, డీల్లీలో ఏం కాబోతుందో ఆ మాత్రం  అంచనాలు లేవు అనుకుంటే తప్పే. ఏపీలోనే టఫ్ ఫైట్ ఉంది, వచ్చే ఎన్నికలలో ఎన్ని సీట్లు వస్తాయో తెలియడంలేదు. అసలు కుర్చీ దక్కుతుందో లేదో కూడా అర్ధం కాని స్థితి. పోయిన ఎన్నికలలో బాబు అనుభవం చూసే మళ్ళీ ముఖ్యమంత్రిని జనం చేశారు.

ఇపుడు ఏ మాత్రం అనుభవం లేని లోకెష్ సీఎం క్యాండిడేట్ అంటే సీన్ రివర్స్ అవుతుంది. కొడుకుని కుర్చీ ఎక్కిద్దామని బాబుకు నిజానికి ఉన్నా ఆయన వ్యూహాలు వేరేలా ఉంటాయి. మరీ ఇంత చవకబారుగా ఉండవు ఏదో చినబాబు మెప్పు కోసం తమ రాజకీయం కోసం పార్టీలో నాయకులంతా ఇష్టం వచ్చినట్లుగా మట్లాడితే అసలుకే ఎసరు వస్తుంది. లోకేష్ కి ఇది తెలియకపోయినా బాబుకు బాగా తెలుసు. కానీ ఏం లాభం. మొదటే చెప్పుకున్నట్లు టీడీపీలో డిసిప్లిన్ లేకుండా పోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: