పార్లమెంట్లో ఈ రోజు మోడీ సర్కార్ పై టీడీపీ పెట్టిన అవిశ్వాసం సందర్భంగా కొన్ని పెండింగ్ హామీలు బీజేపీ అక్కడికక్కడ ఓకే  చేసే చాన్స్ ఉందని రాజకీయ మేధావులతో పాటు, విశాఖవాసులూ  బలంగా నమ్ముతున్నారు. టీడీపీ ఎత్తుకు పై ఎత్తుగా బీజేపీ రైల్వే జోన్ మంజూరు చేస్తూ కీలక ప్రకటన లోక్ సభ వేదికగా ప్రధాని మోడీ  చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీజేపీతో సహా అంతా భావిస్తున్నారు.  ఆ విధంగా టీడీపీకి, చంద్రబాబుకు షాక్ ఇస్తారని అంటున్నారు. 


సరైన టైం ఇదేనా :


విశాఖ  రైల్వే జోన్ పాటు విభజన హామీలన్నీ మేమే నెరవేరుస్తామంటూ చాలా కాలంగా బీజేపీ నాయకులు చెబుతూ వస్తున్నారు. జోన్ పై రాజకీయ పరమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా విశాఖ ఎంపీ హరిబాబుతో పాటు తక్కిన లీడర్లంతా పదే పదే చెప్పారు. సరీన టైం  లో జోన్ ప్రకటన ఉంటుందని కూడా చెప్పారు. ఇపుడు ఆ టైం వచ్చిందా అంటే బీజేపీ వర్గాలు అవుననే అంటున్నాయి. బీజేపీ, టీడీపీ రాజకీయ పోరులో హై హాండ్ కోసమైనా జోన్ ఇస్తారని అంటున్నారు.


పొలిటికల్ మైలేజ్ కోసమేనా :


బీజేపీకి విశాఖలో ఓ పార్లమెంట్ సీట్, ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఉత్తరాంధ్రలో బలంగా ఎదగాలని కూడా ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. వీలైతే ఇక్కడ నుంచి ఎంపీ సీట్లకు ఇమేజ్ ఉన్న బలమైన లీడర్లను దించాలని, ఇతర పార్టీలతో పొత్తులకూ దిగాలని వ్యూహలు రచిస్తున్నారు. దానికంటే ముందుగా జోన్ అన్నది ప్రకటిస్తే ఆ పొలిటికల్ అడ్వాంటేజ్ పూర్తిగా బీజేపీకే ఉంటుందని, రేపటి రోజున జనంలో తిరిగేందుకు,  ఫలానాది చేసామని చెప్పుకునేందుకు బాగా యూజ్ అవుతుందని కాషాయం పెద్దలు ఆలోచిస్తున్నారట. అదే కనుక జరిగితే జోన్ రావడం ఖాయమే మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: