భారత దేశంలో రాను రాను మహిళల, చిన్నారులకు, వృద్ధులకు రక్షణ లేకుండా పోతుంది. కామంతో మృగాళ్లు రెచ్చిపోతున్నారు.  ఆడవారిపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపులకు తెగబడుతున్నారు.  దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ ప్రతిరోజూ ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.  మొన్న నిర్భయ కేసులో నలుగురు కామాంధులకు ఉరి శిక్ష పడినా కొంత మంది కామాంధులకు సిగ్గురావడం లేదు.  ఇలాంటి వారిపై ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా..ఈ దారుణాలు జరుగుతునే ఉన్నాయి.  తమిళనాడులో ఓ చిన్నారిపై 24 మంది ఏడు నెలల పాటు దారుణంగా అత్యాచారం చేసిన ఘటన మరువక ముందే హర్యానాలో ఓ మహిళపై నలభై మంది అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 

వివరాల్లోకి వెళితే..హర్యానాలోని పంచకులలో ఓ మహిళకు ఉద్యోగం ఇస్తామని చెప్పి గెస్ట్ హౌజ్ కి పిలిచి అక్కడే ఆమెను బంధించిన నాలుగు రోజుల పాటు దారుణంగా అత్యాచారం జరిపారు.  కాగా, ఉద్యోగానికి వెళ్లిన ఆ మహిళ నాలుగు రోజులైనా రాకపోవడంతో  గురువారం చంఢీగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 

రంగంలోకి దిగిన పోలీసులు సీరియస్ గా దర్యాప్తు ప్రారంభించారు.  కాగా ఆ మహిళ వెళ్లిన గెస్ట్ హౌజ్ గుర్తించారు..వెంటనే అక్కడికి వెళ్లి ఆమెను రక్షించారు. ఆ మహిళ తెలిపిన వివరాల ప్రకారం..తనకు ఉద్యోగమిస్తానని తన భర్తకు చెప్పిన వ్యక్తే జూలై 15వ తేదీనాడు తనను గెస్ట్ హౌజ్ లో బంధించి తనతో పాటు 39 మందిని పిలిచి నాలుగు రోజుల పాటు అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. కాగా ఆ గెస్ట్‌ హౌస్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: