పార్టీని పెట్టిన అన్న గారినే దింపేసి గద్దెనెక్కిన చంద్రబాబు జమానా ఇది. ఆత్మలను చంపుకుని మరీ రాజకీయం చేస్తున్న రోజులివి. అటువంటిది ఎపుడో దాదాపు పాతికేళ్ళ క్రితం చనిపోయిన నందమూరి వారి ఆత్మ క్షోభిస్తుందంటే తెలుగు తమ్ముళ్ళు కంగారు పడతారా. తమ రాజకీయాలను ఆపేసుకుంటారా. ఏంటో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు గారి పిచ్చి కాకపోతేనూ... ఇంతకీ ఆయన గారి బాధేమిటంటే చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలుపుతున్నారనిట.  ఆ పార్టీ మద్దతుతో అవిశ్వాసం పెట్టారట.


ఇదే మొదటిసారా..ఏంటి :


నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న తరహాలో బాబు గారి పార్టీ రాజకీయం సాగిపోతూ ఉంటుంది. ఆయనకు తర, తమ భేదం అసలే లేదు. కుర్చీ కోసం ఎన్ని పాట్లు పడమన్నా రెడీ. అన్నట్లు కాంగ్రెస్ తో మన బాబు గారి బంధం బహు గట్టిది, దొడ్డది. అసలు ఆయన పుట్టిందే ఆ పార్టీలో కదా. తన రక్తంలో ముప్పై శాతం కాంగ్రెస్ ఉందని చెప్పుకున్న పెద్ద మనిషాయన. పైగా అనేక సందర్భాలలో ఆయన చేయి కలిపేశాడు కూడా. 1996 లో యునైటెడ్ ఫ్రంట్ పేరిట బాబు చేసిన రాజకీయంలో కాంగ్రెస్ కదా పక్కన ఉన్నది. ఇక వైఎస్సార్ చనిపోయాక మళ్ళీ కాంగ్రెస్ తో తెర చాటు బంధం కొనసాగించి జగన్ పై కేసులు ఉమ్మడిగా పెట్టిన పాలిట్రిక్సూ ఆయనదే కదా.


కాంగ్రెస్ నయమంటున్నారుగా :


ఉమ్మడి ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి పై అవిశ్వాసం వేళ ఓటేసి మరీ  కాపాడిన వైనమూ ఆయనదే. ఇక చీకట్లో చిదంబరాలను కలవడం వగైరాలూ ఎన్నో బాబు పాలిటిక్స్ లో భాగం.  లేటెస్ట్ గా కుమారస్వామి ప్రమాణం వేళ బెంగులూర్ వెళ్ళి మరీ యువ రాజు రాహుల్ భుజం తట్టిందీ ఈ చంద్రబాబే కదా. ఇక నిన్నటికి నిన్న అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ చాలా నయమంటూ పొగిండిందీ ఈ నోరే కదా. మరి అలాంటి చంద్రబాబు గురించి అన్నీ హరిబాబు ఇలా వగచి వాపోవడం చూస్తుంటే అన్న గారి  ఆత్మ కాదు, కమల నాధుల ఆత్మలే  కలవరపడుతున్నాయేమో అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: