ఈ మద్య జనాలు   ఒక పూట తినకుండా అయినా ఉండగలుగుతున్నారు కానీ.. వాట్సాప్ లేనిదే ఎవరూ ఉండడం లేదు. వాట్సాప్ లో గ్రూపులు క్రియేట్ చేసి మరీ తమ మంచీ చెడులు చెప్పుకుంటున్నారు. వాట్సాప్ కేవలం సరదాలకే కాదు.. వివిధ ఉద్యోగులు - సంస్థలు కూడా తమ కార్యకలాపాలను కొనసాగించడంలో కీలకంగా వ్యవహరిస్తోంది.  మనీ ట్రాజెక్షన్స్ కూడా జరిపే సదుపాయాలు కల్పించబడ్డాయి. మీడియా సంస్థలు కూడా వాట్సాప్ ద్వారానే తమ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. సమాచార విప్లవంలో వాట్సాప్ చేసిన మేలు అంతా ఇంతా కాదు..అయితే ఇది ఒక కోణం మాత్రమే. అంతా బాగుందీ అనుకుంటున్న సమయంలో వాట్సాప్ తో ఇప్పుడు ఎన్నో అనార్ధాలు జరుగుతున్నాయి. వాట్సాప్ తో ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో అనర్ధాలు కూడా అన్నే ఉన్నాయి.  


కొంత మంది టెక్నాలజీని మంచికన్నా చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.    తప్పుడు వార్తలు - వదంతులను వినియోగదారులు లక్షల మందికి అన్యపదేశంగా పంపిస్తున్నారు. తప్పుడు వార్తలు అన్నీ వైరల్ అవుతున్నాయి.  ఎంతో మంది అన్యాయంగా చనిపోతున్నారు.  గడిచిన రెండు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా దాదాపు 20 మందికి పైగా వాట్సాప్ తప్పుడు వార్తల కారణంగా మృతి చెందినట్టు కేంద్రం అంచనా వేసింది. పిల్లల కిడ్నాపర్లుగా భ్రమించి అపరిచిత వ్యక్తులను స్థానికులు కొట్టి చంపుతున్న వైనంపై కేంద్రం సీరియస్ అయ్యింది. 


ఇకపై ఒకేసారి ఐదుగురికి మాత్రమే సమాచారాన్ని షేర్  చేసే సదుపాయం కల్పించింది.  షేర్ ఐకాన్ ను సైతం తొలగిస్తామని వాట్సాప్ తాజాగా వెల్లడించింది.  ఇక నుంచి ఐదు చాట్ లకు మాత్రమే మెసేజ్ లను పంపేలా పరిమితిని విధిస్తున్నట్టు పేర్కొంది. భారత్ లోని వినియోగదారులంతా ఏకకాలంలో ఇక నుంచి ఒక సందేశాన్ని ఐదుగురికి మాత్రమే పంపేలా క్విక్ ఫార్వర్డ్ బటన్ ను తొలగించి నియంత్రణ విధిస్తోంది.   వాట్సాప్ లో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను నియంత్రించాలని తాజాగా కేంద్రం సదరు సంస్థను ఆదేశించింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో వాట్సాప్ సంస్థ ఈ మార్పులు చేసింది. ఈ నిర్ణయంతో ఇప్పుడు జనాలకు షాక్ తగిలింది.   


మరింత సమాచారం తెలుసుకోండి: