పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెట్టి క్రెడిట్ కొట్టేద్దాం అనుకున్న బాబుకు షాక్ తగిలిందని చెప్పాలి. పార్లమెంట్ సాక్షిగా మోడీ చేసిన వ్యాఖ్యలు చంద్ర బాబు ను ఇబ్బంది పెట్టేవే. దీనితో చంద్ర బాబు అంతర్మధనం లో   పడిపోయాడు.  2016, సెప్టెంబ‌ర్‌లో చంద్రబాబు అంగీకారంతోనే ప్యాకేజీ ప్రక‌టించామ‌న్నారు. ప్యాకేజీ ప్రక‌టించినందుకు కేంద్రప్రభుత్వాన్ని, కేంద్ర ఆర్థికమంత్రిని అభినందిస్తూ బాబు అసెంబ్లీ తీర్మానం చేశారన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలిపిన చంద్రబాబు త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు యూట‌ర్న్ తీసుకున్నార‌ని పార్లమెంట్ వేదిక‌గా ప్రధాని అన్నారు. అంతేకాదు తాను ఫోన్‌చేసి మీరు వైసీపీ వ్యూహంలో చిక్కుకుంటున్నార‌ని కూడా హెచ్చరించాన‌న్నారు.
Image result for chandra babu

ఈ అవిశ్వాసం త‌న‌పై కాద‌ని, కాంగ్రెస్ త‌నవెంట ఎంతమంది మిత్రులున్నారో తెలుసుకునేందుకే అని మోడీ అన‌డం వెనుక లోతైన అర్థందాగి ఉంది. టీడీపీని కాంగ్రెస్ మిత్రప‌క్ష జాబితాలో చేర్చడంలో బీజేపీ విజ‌య‌వంత‌మైంది. కాంగ్రెస్ మునిగిపోతోంద‌ని, దానివెంట ఉన్నవాళ్లు కూడా మునిగిపోతార‌ని ప్రధాని ప‌రోక్షంగా టీడీపీని హెచ్చరించారు. కేసీఆర్ మంచి పాల‌నాద‌క్షుడ‌ని, తెలంగాణ అభివృద్ధిలో ముందుంద‌ని చెబుతూ చంద్రబాబు ఏమీచేయ‌డం లేద‌ని ప‌రోక్షంగా విమ‌ర్శించారు.

Image result for modi speech\

తీరా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు, వ్యతిరేకంగా 325 ఓట్లు వ‌చ్చాయి. మోడీ అన్నట్టు కాంగ్రెస్‌, టీడీపీ కూట‌మికి కేవ‌లం 126మంది మ‌ద్దతున్నారు. ఈ అవిశ్వాస తీర్మానం ద్వారా మోడీని మ‌రింత బ‌లోపేతం చేసిన‌ట్టైంది. అవిశ్వాసం తీర్మానం ద్వారా తాము ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నట్టు మైలేజ్ సంపాదించుకోవాల‌ని ఎత్తుగ‌డ‌ను మోడీ చిత్తుచేశారు. అంతేనా ప్రత్యేకహోదా విష‌యంలో చంద్రబాబు నైతిక‌త‌ను దెబ్బతీసేలా మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: