తెలుగుదేశానికి పట్టు కొమ్మలాంటి ఉత్తరాంధ్ర జిల్లాలు ఈసారి రివర్స్ గేర్లో వెళ్తున్నాయా. ఆ పార్టీకి ఇంటికి దారి చూపిస్తున్నాయా అంటే సమాధానం అవుననే వస్తోంది. పోయిన ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని చంద్రబాబు సీఎం కావడానికి పూర్తిగా మద్దతు ఇచ్చిన ఈ మూడు జిల్లాలూ ఇపుడు తలాక్ అంటున్నాయి. రూట్ మారిస్తే గానీ మా ఫేట్ మారందంటున్నాయి.


రెడ్ సిగ్నల్ పడినట్లే  :


ఉత్తరాంధ్ర జిల్లాలలో అయిదుగురు మంత్రులు ఉన్నారు. అందరూ సీనియర్లే, గండర గండర్లే. కానీ రాజకీయ వాతావరణమే రివర్స్ కొడుతోంది. దాంతో వీరంతా డేంజర్ జోన్లో ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మొదట ఓడిపోయేది  ఏపీ టీడీపీ అధ్యక్షుడు , విధ్యుత్తు మంత్రి కిమిడీ కళా వెంకట రావు అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. సొంత పార్టీలోనే గ్రూపులకు తోడు, కళా పనితీరు కూడా ఆయనను ఓటమి అంచున నిలబెట్టాయని అంటున్నారు.


నోరున్న ఆ మంత్రికీ షాక్ :


ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో మంత్రి, పెద్ద నోరు చేసుకుని విపక్షాలపై  విరుచుకుపడే అచ్చెన్నాయుడుకు కూడా ఏమంత బాగా లేదంటున్నారు. టెక్కలిలో పెద్ద ఎత్తున ప్రజా వ్యత్రిరేకత మూట కట్టుకున్న ఈయనకు సరైన ప్రత్యర్ధిని వైసీపీ వెతుకుతోంది. అదే జరిగితే ఈ మంత్రి గారు ఇంటికే అంటున్నారు. ఇక విజయనగరం జిల్లాలో ఫిరాయింపు  మంత్రి సుజయక్రిష్ణ రంగారావుకి కూడా  పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆయన పార్టీ ఫిరాయింపే పెద్ద మైనస్ అవుతోంది. ఇక్కడ వైసీపీకి ఈ సారి విక్టరీ ష్యూర్ అంటున్నారు.


ఆ ఇద్దరికీ అదే రూట్ :


విశాఖ జిల్లాలో ఇద్దరు మంత్రుల తీరూ అలాగే ఉంది. ఒక మంత్రి అయ్యన్నపాత్రుడు మళ్ళీ గెలిచే అవకాశాలు లేవన్నది నిర్దారణకు వచ్చే పోటీ చేయనని తప్పుకుంటున్నట్లు టాక్. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల కాలంలో పలు వివాదాలలో చిక్కుకున్నారు. ఆయన గారి భీమిలీ సీటు  డౌటేనని ఓ సర్వే కూడా  చెప్పిన సంగతి తెలిసిందే. సో మొత్తానికి మొత్తం పంచ పాండవుల్లాంటి అయిదురుగు మంత్రులకూ ఎదురుగాలి వీస్తూంటే  ఇక టీడీపీ ఎమ్మెల్యే సంగతి చెప్పనక్కరలేదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: