ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ తలపెట్టిన బంద్ పిలుపునకు కామ్రేడ్స్ దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ పొడ గిట్టనట్లుగా వ్యవహరిస్తున్న సీపీఐ రామక్రిష్ణ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. తిరుపతిలో ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కోటి మందితో మానవహారం బుధవారం నిర్వహిస్తామని చెప్పారు. జనసేన, ఆప్, లోక్ సత్తా వంటి పార్టీలతో కలసి తమ అందోళన సాగుతుందన్నారు.  మరి రేపటి బంద్ గురించి మాత్రం ఆయన మాట్లాడకపోవడం విశేషం


ఎందుకిలా...?


వైసీపీ బంద్ పిలుపు వామపక్షాలకు ఎందుకు నచ్చడంలేదు. అంటే దానికి బోలెడు కారణాలున్నాయి.  ప్రత్యేక హోదా రాకపోవడానికి ఆ రెండు పార్టీ వైఖరి కారణమట. టీడీపీ, వైసీపీ ఒక్కటేనంటూ వారికి వ్యతిరేకంగా మూడవ కూటమి ఏర్పాటు చేస్తామని రామక్రిష్ణ అంటున్నారు. బాగానే ఉంది కానీ  ప్రత్యేక హోదా  అన్నది ఏ ఒక్క రాజకీయ పార్టీ అంశం కాదు కదా, . మరి దాని విషయంలో ఇంతవరకు ఫైట్ చేశామంటున్న కామ్రేడ్స్ ఎవరు ఉద్యమించినా సపొర్ట్ చేయాలి కదా. ఇక్కడ సీన్ చూస్తే మాత్రం రివర్స్ లో ఉంది.


ఆ పార్టీ కూడా అంతేనా :


ఇక ఏపీలో వైసీపీనే టార్గెట్ చేసిన కాంగ్రెస్ కూడా బంద్ కు మద్దతు ఇవ్వకపోవచ్చునంటున్నారు. ఆ పార్టీ సైతం తామే హోదా ఇచ్చేది, తెచ్చేది అంటోంది. అధికార టీడీపీ విషయం చెప్పనక్కరలేదు. ఇప్పటికే బంద్ పై విష ప్రచారం మొదలెట్టేసింది. టోటల్ గా చూస్తే వైసీపీ బంద్ ఒంటరి పోరాటంగానే మిగిలే అవకాశం ఉంది. అయితే జనం మద్దతుగా ఉంటే ఏ బంద్ అయినా సక్సెస్ అన్నది ఇంతకు ముందే ప్రూవ్ అయింది. బట్ ఏపీకి ప్రాణాధారం అయిన హోదా విషయంలోనూ పార్టీల మధ్య పాలిటిక్స్ ఈ స్థాయిలో  ఉంటే కేంద్రంలో ఎవరున్నా హోదా ఇస్తారా అన్నదే డౌట్. 


మరింత సమాచారం తెలుసుకోండి: