సాధారణంగా పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు..మరి ఆ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేలా జరిపించాలని పెద్దలు అనుకుంటారు. ఎవరి తాహతను బట్టి వారు పెళ్లి అరేంజ్ మెంట్స్ చేస్తుంటారు.  ఈ మద్య పెళ్లిళ్లు చాలా వెరైటీగా జరపుతున్న విషయం తెలిసిందే.  తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో ఓ పెళ్లి వేడుకలో బెల్లీ డ్యాన్స్ నిర్వహించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... చాంద్రాయణగుట్ట పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని వార్త పోలీసులకు అందింది.

వెంటనే అక్కడకు వెళ్లి చూడగా..అనుమతి లేకుండా ఈ డ్యాన్స్ నిర్వహించడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లి కొడుకు తండ్రిని, ఫంక్షన్ హాల్ ఓనర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ..చట్ట వ్యతిరేకంగా ఈ పనులు చేశారని..పెళ్లి కొడుకు తన దుబాయ్ ఫ్రెండ్స్ కోసం బెల్లీ డ్యాన్స్ ఏర్పాటు చేశారని, శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇది నిర్వహించారని చెప్పారు.  అయితే బెల్లీ డ్యాన్స్ కోసం రష్యన్ యువతులు, ముంబై యువతులను రప్పించారని అన్నారు. 

వీరంతా పెళ్లి ఫంక్షన్లో అర్థనగ్న నృత్యాలు చేశారని అన్నారు.  ఇక బెల్లీ డ్యాన్స్ కోసం యువతులను తీసుకొచ్చిన ఆర్గనైజర్ ను గుర్తించామని, జూబ్లీ హిల్స్ కు చెందిన వెంకట్ ఈవెంట్ ఆర్గనైజర్ గా పనిచేశారని చెప్పారు.  ఇందుకోసం పెళ్లి కోడుకు దాదాపు రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తుందని వారు అన్నారు. నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: