టీడీపీ 2014 లో బీజేపీ తో జతకట్టి విజయాన్ని స్వంతం చేసుకున్నది. దానికి తోడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా దొరకడం తో చంద్ర బాబు మరలా సీఎం అయ్యాడు. అయితే ఇప్పడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ కి ఇప్పుడు ఇద్దరు మిత్రులు దూరం అయినారు. ఇప్పడూ కొత్త మిత్రుల వేటలో ఉంది టీడీపీ. అయితే టీడీపీ కాంగ్రెస్ తో జతకట్టే వ్యహం చేస్తునట్టు కనిపిస్తుంది. ఇప్పటికే చంద్ర బాబు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి గురించి ఒక  అధ్యాయనం చేస్తున్నట్టు భోగట్టా..!

Image result for chandra babu

గత ఎన్నికల నాటి కాంగ్రెస్‌కు, ఇప్పటి కాంగ్రెస్‌కు తేడా ఏమిటి? అని ఏపీ జనాలు కాంగ్రెస్ విషయంలో వ్యూను ఏమైనా మార్చుకున్నారా? అనే ప్రశ్నలను సగటు ఏపీ పౌరుడిని అడిగితే, నాటితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరింత వీక్ అయ్యింది కానీ, బలం పుంజుకున్నది లేదనే అంటాడు. కనీసం గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వద్ద అధికారం ఉండింది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ తరఫున కొందరైనా ఉత్సాహంగా పోటీచేశారు.

Image result for congress

డబ్బులు చేతిలో ఉన్నాయి, అంతవరకూ కొంతమంది కార్యకర్తలను వెంట పెట్టుకున్నారు కాబట్టి కనీసం ఆ మాత్రం ఓట్లు అయినా వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తువల్ల తెలుగుదేశం పార్టీకి ఆ ఒక్కశాతం ఓట్లు అయినా ట్రాన్స్‌ఫర్ అవుతాయా? అనేది ప్రశ్నార్థకమే. తెలుగుదేశం పార్టీ పునాదులు ఎలాపడ్డాయో అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ వ్యతిరేకతే టీడీపీకి ఆయువుపట్టు. ఇప్పుడు అత్యంత అవకాశవాదంతో కాంగ్రెస్ తో చేతులు కలిపితే, టీడీపీ పుట్టి పూర్తిగా మునిగిపోవడం మాత్రం ఖాయం!

మరింత సమాచారం తెలుసుకోండి: