పోలవరం విషయంలో ఏపీ సీఎం బాబుకు మరో షాక్ తగిలింది. అంచనాలు పెంచుకుంటూ పోతే డబ్బులు ఇచ్చేందుకు సిధ్ధంగా లేమన్న సంగతిని లేటెస్ట్ గా మరో మారు కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై ఈ రోజు పార్లమెంట్లో  వివరణ ఇచ్చిన కేంద్రం అంచనాల పెంపు అంశం సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీస్తోందని, కమిషన్ అడిగిన వాటికి ఏపీ సర్కార్ సంత్రుప్తి కరమైన సమధానలు పంపితేనే సవరించిన అంచనాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని పూర్తి క్లారిటీ ఇచ్చేసింది.


అమాంతం పెరిగాయి :


నిజానికి పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు  2010-11 లో కేవలం 16,101 కోట్ల రూపాయలు ఉండగా, తెలుగుదేశం ప్రభుత్వం తాజాగా వేసిన అంచనాలు చూస్తే 58,319 కోట్ల రూపాయలకు చేరుకుంది. పెంచిన అంచనాలకు అనుగుణంగా నిధులను ఇవ్వలంటోండి ఏపీ సర్కార్. అయితే సరిగ్గా ఇక్కడే మెలిక పెట్టింది మోడీ ప్రభుత్వం.


టోటల్ డీటైల్స్ కావాలంట :


భూసేకరణ, పునరావాసం, కుడి, ఎడమ కాలువల డిజైన్ల మార్పు, హెడ్ వర్క్స్ ప్రమాణం పెంపు వంటి అంశాలపై వాటర్ కమిషన్ పూర్తి వివరాలను కోరుతోంది. మరి వీటికి సంబంధించి బాబు సర్కార్ సరైన సమధానాలు అంటే కమిషన్   ఫుల్ శాటిస్ ఫై అయ్యే విధంగా ఆన్సర్లు ఇస్తేనే నిధుల మంజూరు జరుగుతుంది.


లెక్కలు సరితూకం అయ్యే పనేనా :


బాబు సర్కారు అసలే  అడ్డగోలుగా పోతోంది. పోలవరం కావాలని టేకప్ చేసిందే అందుకు. లెక్కకు మిక్కిలిగా నిధులు కేంద్రం ఇస్తుందని ఆశిస్తే ఇలా కొర్రీలు పెట్టడం నిజంగా టీడీపీకి షాక్ అనే చెప్పాలి. జాతీయ ప్రాజెక్ట్ అని చెబుతున్నా పోలవరానికి సంబంధించి 2014 నుంచి ఇప్పటి వరకు కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ కిందనే కేంద్రం నిధులు ఇస్తోంది మరి పునరావాసం అతి పెద్ద తలకాయ నొప్పి. ఇక్కడే అధిక నిధులు కావాలి. అంచనాలు పెంచిందీ ఇక్కడే.

మరి, ఈ విషయంలో లెక్కలు ఎప్పటికీ తేలవు సరి కదా లడాయితో కేంద్రం తప్పించుకున్నా ఇపుడు అడిగే నాధుడు కూడా లేడు. అంతే మరి. రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య చెడింది,  ఇపుడు టాం అండ్ జెరీ స్టొరీ నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: