ఒక‌రేమో మేధావుల సంఘం పెట్టి త‌న‌ను తాను మేధావిగా ప్ర‌క‌టించుకున్న వ్య‌క్తి.  ఇంకోరేమో అవ‌స‌రానికి మాత్రం ప్ర‌త్య‌క్ష‌మై  ల‌క్ష్యం చేసుకున్న పార్టీ, వ్య‌క్తుల‌పై ఆరోప‌ణ‌లు చేసి మాయ‌మైపోయే సినీ న‌టుడు.  కొంత‌కాలంగా ప్ర‌త్యేక‌హోదా పోరాటంలో వీర బిల్డ‌ప్ లు ఇచ్చిన ఆ ఇద్ద‌రు ఈరోజు ఎక్క‌డా అడ్ర‌స్ లేరు. ఈ పాటికే అర్ధ‌మైపోయుంటుంది ఆ ఇద్ద‌రూ ఎవ‌రో ? క‌రెక్ట్ వాళ్ళే ఒక‌రు మేధావుల సంఘం అధ్య‌క్షుడు చ‌ల‌సాని శ్రీ‌నివాస్. ఇంకోరేమో సినీ హీరో శివాజి. 


మేధావులు ఎక్క‌డున్నారో ?

Image result for chalasani srinivas and hero sivaji

ప్ర‌త్యేక‌హోదా డిమాండ్ తో ఈరోజు బంద్ సంద‌ర్భంగా  రాష్ట్రంలో ఇంత ర‌చ్చ జ‌రుగుతోంది.  ఒక‌వైపు కేంద్ర‌ప్ర‌భుత్వం నిర‌కుంశ‌ధోర‌ణి, ఇంకోవైపు రాష్ట్ర‌ప్ర‌భుత్వం అణిచివేత‌.  ఫ‌లితంగానే ఈరోజు వైసిపి బంద్ పిలుపు.  మ‌రి ఇంత ర‌చ్చ‌ జ‌రుగుతున్నా ఈ ఇద్ద‌రు మేధావులు ఎక్క‌డా క‌నిపించ‌ లేదు. పైగా చ‌ల‌సాని అయితే  వైసిపినే త‌ప్పుప‌డుతున్నారు. అంటే ఇక్క‌డ మ్యాట‌ర్ వెరీ క్లియ‌ర్. పై ఇద్ద‌రు మేధావులు చంద్ర‌బాబునాయుడుకు మ‌ద్ద‌తుగానే మాట్లాడుతున్నారు. 


జ‌గ‌న్ డిమాండ్ న‌చ్చ‌లేద‌ట‌

Image result for chalasani srinivas and hero sivaji

రాజీనామాలు చేసేంత వ‌ర‌కూ ఎంపిలంద‌రూ రాజీనామాలు చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంద‌ని చ‌ల‌సాని చెప్పారు. వైసిపి ఎంపిల రాజీనామాల త‌ర్వాత మాట్లాడుతూ,  రాజీనామాలు చేస్తే ఏం వ‌స్తుందంటూ అమాయ‌కంగా ప్ర‌శ్నించటం విచిత్రంగా ఉంది. ఇపుడు కూడా బంద్ కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌టం లేదు. ఎందుకంటే,  టిడిపి ఎంపిల రాజీనామాల‌పై జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్ట‌డం చ‌ల‌సానికి న‌చ్చ‌లేద‌ట‌. అందుకే బంద్ కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌టం లేద‌ని చెప్ప‌టం చాలా హాస్యాస్ప‌దంగా ఉంది. చ‌ల‌సానినో లేక‌పోతే శివాజీ లాంటి వాళ్ళ‌నో  న‌మ్ముకునేనా జ‌గ‌న్ వైసిపిని న‌డుపుతున్న‌ది, ఆందోళ‌న‌లు చేస్తున్న‌ది ?
 


మరింత సమాచారం తెలుసుకోండి: