తండ్రి హయాంలో ప్రజాధనాన్ని ఇష్టమొచ్చినట్లుగా లూటీ చేసి రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి...తండ్రి చనిపోయాక 16 నెలలు జైలు జీవితం గడిపి చిప్పకూడు తిని ప్రజల సానుభూతి సంపాదించుకుని ప్రతిపక్షంలో ఉన్న జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆయన వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలకు తెగబడ్డారు. దీంతో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది. పవన్ పై జగన్ వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తుందని పేర్కొంది. అంతేకాదు రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, పవన్ ను రాజకీయంగా ఎదుర్కొనలేకే జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని తప్పపట్టింది.

Related image

పవన్ పై జగన్ నీచమైన భాష వాడారని, సభ్య సమాజం తలదించుకునేలా జగన్ వ్యాఖ్యలు చేశారన్నారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. నిన్నటి వరకూ పవన్ ను తిట్టిపోసిన తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో మాత్రం ఆయనకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది. పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తిత్వంగల మనిషి సినిమా ఇండస్ట్రీలో లేరని పేర్కొన్నారు కొంతమంది టిడిపి నాయకులు.

Related image

ప్రజల సొమ్మును దోచేసే నాయకులు కూడా పవన్ పై విమర్శలు చేసే రోజులు ఉన్నాయంటే మనం ప్రస్తుతం ఎటువంటి సమాజంలో బ్రతుకుతున్నామని అంటున్నారు మరికొంతమంది టిడిపి నాయకులు. రాజకీయాలలో రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారంటే అది రాజకీయంగా ప్రత్యర్థిని ఎదుర్కొనలేక పోవడానికి సాదృశ్యం అని అంటున్నారు కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులు.

Image result for tdp

తమను గతంలో విభేదించిన గాని పవన్కళ్యాణ్ వృత్తిగత జీవితంపై జగన్ విమర్శ చేస్తే ఊరుకోమని పేర్కొన్నారు టిడిపి నాయకులు. సీఎం కుర్చీ కోసం రాష్ట్రం అభివృద్ధి చెందకుండా రోడ్డుమీద తిరుగుతూ ప్రజలను రెచ్చగొడుతూ నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే ఎవరు ఊరుకోమని అన్నారు. మరోపక్క జగన్ పవన్ పై చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. దొంగలు జైల్లో ఉండాలి రోడ్డుపై ఉంటే ఇలానే ఉంటుందని దారుణమైన కామెంట్లు చేస్తున్నారు పవన్ అభిమానులు.


మరింత సమాచారం తెలుసుకోండి: