విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా మోసం చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పై మండిపడి ఇటీవల బంద్ చేశారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో..జగన్ సూటిగా చాలా స్ట్రాంగ్ గా పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు.

Related image

కార్లు మార్చినట్టు పవన్ కళ్యాణ్ తన భార్యలను మారుస్తాడు అటువంటి వ్యక్తికి ఆయన చేసే ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఘాటైన విమర్శలు చేశారు జగన్. ఈ సందర్భంగా జగన్ చేసిన కామెంట్లపై మాజీ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు."జగన్ మాట్లాడినట్టుగా పేపర్‌లో ఏదైతే వచ్చిందో..అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు. దీంట్లో రెండో ఆలోచన లేదు.

Related image

పవన్ కల్యాణ్ అన్న వాడికి ఎంతమంది పెళ్లాలు ఉన్నారనేది.. ఆ పెళ్లాలే తేల్చుకోవాలి తప్ప నీకూ నాకూ సంబంధం లేదని మన చట్టం చెబుతుంది. ఏ పెళ్లాన్ని అయితే ఇబ్బంది పెట్టారో ఆ పెళ్లాం కోర్టుకు వెళ్లొచ్చు. అంతేకానీ, మనకేమీ కామెంట్ చేసే అధికారం లేదు. తప్పు చేస్తే..తప్పు చేస్తున్నావు, ఇలా చేయొద్దని చెప్పాలి. మరొకరు కామెంట్ చేయకూడదు.

Image result for jagan pawan

ఇలాంటి వ్యాఖ్యలు వైసీపీ, జనసేనకు ఆరోగ్యకరం కాదు”. రాజకీయంగా ప్రత్యర్థులపై ప్రజాసమస్యల కోణంలో విమర్శలు చేయడం సర్వసాధారణం కానీ వ్యక్తిగత విషయాల్లో కి వెళ్లి కామెంట్ చేయడం మంచిది కాదని అన్నారు ఉండవల్లి...మొత్తంమీద చూసుకుంటే జగన్ చేసిన కామెంట్స్ పట్ల ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: