ఆంధ్రప్రదేశ్ లో మైనింగ్ మాఫియా ఏ రేంజ్ లో కొనసాగుతుందో ఇప్పటికే పలు సంఘటనలు రుజువు చేశాయి.  ఓ పక్క న్యాయ వ్యవస్థలు ఈ అక్రమాలపై ఎన్ని సార్లు హెచ్చరికలు చేసినా కొంత మంది ప్రభుత్వంతో కుమ్మక్కై ఈ దందాలు నడుపుతూనే ఉన్నారు.    నేను సచ్చీలుడిని పదే పదే చెప్పుకునే చంద్రబాబు పాలన వైఫల్యం పట్ల, ఆశ్రిత పక్షపాతం పట్ల ఓ అభిశంసనగానే హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవాలి… దీని ప్రాధాన్యం ఏమిటంటే..? ఈ కేసులో నిందితుడు సాక్షాత్తూ తెలుగుదేశం శాసనసభ్యుడు… గతంలో కోర్టు ఈ అక్రమ మైనింగు ఆపేయాలని చెప్పినా సరే తను ఖాతరు చేయలేదు… యథేచ్ఛగా తన దందా కొనసాగించాడు.

Image result for mining

 ఒక హైకోర్టు ఒక కేసులో ఏమేం తదుపరి చర్యలు తీసుకోవచ్చో చెప్పాలంటూ కాగ్, సీబీఐ, గనుల శాఖల్ని ఆదేశించడం అసాధారణం… లక్షల టన్నుల జాతిసంపదను అక్రమంగా కొల్లగొడుతున్న తీరు, ప్రజల కళ్లు గప్పటానికి ముగ్గురో, నలుగురో పనివాళ్లపై కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్న తీరు స్పష్టంగా… సదరు ఎమ్మెల్యేకు ప్రభుత్వ ముఖ్యుల సహకారాన్ని, వ్యవస్థల పట్ల బరితెగింపునూ తేటతెల్లం చేస్తున్నది.

Image result for mining andhrapradesh

హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యల్ని కొన్ని పెద్ద పెద్ద పేపర్లు ఏదో రాశామన్నట్లుగా మమా అనిపించాయి.  ఈ సారి   సాక్షి  మాత్రం దీని ప్రాధాన్యాన్ని గుర్తించింది… నిజమే కదా… ఎర్రచందనం స్మగ్లర్ల పేరిట అనేకమంది కూలీలను అడ్డంగా కాల్చిపారేసిన ప్రభుత్వం… ఈ నాలుగేళ్లలో, ఈ బాగోతంలో ఎందరు అసలు బడా దొంగల్ని పట్టుకున్నది మాత్రం శూన్యం.  ఒకవేళ పట్టుకున్నా అవన్నీ చిన్నీ చిన్న చిన్న చేపలే.  


ఈ అక్రమ మైనింగు వ్యవహారం కోర్టు దాకా పోయింది కాబట్టి, ఆ మైనింగుకు బాధ్యులుగా కూలీలను బుక్ చేశారే తప్ప పెద్ద చేపల జోలికి వెళ్లిందే లేదు… మైనింగు ఆగిందీ లేదు… అదే హైకోర్టు గమనించిన అంశం కూడా… అందుకే సీరియస్‌గా స్పందించింది… ఒకసారి ఆ వ్యాఖ్యల తీవ్రత చూడండి…కేవలం ముగ్గురు, నలుగురు కూలీలు రాత్రికిరాత్రి 12.55 లక్షల టన్నుల ఖనిజాన్ని తవ్వి తరలించేశారా..? అసలు ఈ వ్యవహారంలో అధికారులూ అవినీతికి పాల్పడ్డట్టేనా..? అసలు బాధ్యులను ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు..? అంటున్న కోర్టు ఇక రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేక, కాగ్ ద్వారా విచారణ జరిపిస్తానని చెప్పింది.

Image result for mining andhrapradesh

ఈ మొత్తం కేసులో అన్ని లక్షల టన్నుల ఖనిజం విలువ ఎంత అనేది ముఖ్యం కాదు… వ్యవస్థల్ని, కోర్టుల్ని అధికారంలో ఉన్న పెద్దలు తేలికగా తీసిపారేసి, మాకు ఎదురెవ్వరు..? మమ్మల్ని ప్రశ్నించేవారెవ్వరు..? మమ్మల్ని ఆపేవారెవ్వరు..? అనే తరహాలో తమ దందాను కొనసాగించిన తీరే అసలు విచారణార్హం… నిందితుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడం, తనకు ప్రభుత్వ పెద్దల సహకారం ఉండటమే ఈ ధీమాకు కారణం కాదా..? ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తుల ఉపేక్షకు కేవలం సొంత ఎమ్మెల్యే కావడమే కారణమా..? ఇంకేమైనా బాగోతాలున్నాయా..? అనేదీ చర్చనీయాంశం.


ఇవే వ్యాఖ్యల్ని ఇంకేదైనా కేసులో గనుక కోర్టు చేసి ఉంటే, ఇప్పటికే ఏపీ మీడియా రచ్చ రచ్చ చేసి ఉండేది… అధికార పార్టీ అర్జెంటుగా ఓ వంద ప్రెస్‌మీట్లను ఆర్గనైజ్ చేసి ఉండేది… కానీ ఈ కేసులో మాత్రం కిమ్మనడం లేదు… జరిగిన నష్టాన్ని లెక్క తేల్చటానికి కాగ్, అక్రమాల తీరు నిగ్గు తేల్చటానికి సీబీఐ రంగంలోకి దిగితేనే… ఈ కేసులో అక్రమాల తీవ్రత ఎంతో బయటపడదు… మోడీజీ… వింటున్నారా..?


మరింత సమాచారం తెలుసుకోండి: