పవన్ కళ్యాణ్ మీద జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. ఏకంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి గత జీవితం గురించి  వ్యాఖ్యలు చేసినారు. అయితే అవన్నీ నిజం అనుకోండి కానీ ఆలా మాట్లాడటం రాజకీయాల్లో దూకుడు తనానికి నిదర్శనమని తెలుస్తుంది. అయితే జగన్ మాట్లాడిన దానిలో తప్పేముందని అని ప్రశ్నించేవారు లేక పోలేదు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయమే వాస్తవమే. పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు అందరికీ తెలిసిందే. 

Image result for pawan kalyan janasena

రేణుదేశాయ్‌తో విడాకులు తీసుకోకుండానే అన్నా లెజ్‌నెవాతో పవన్‌కళ్యాణ్‌ 'సంబంధం' పెట్టుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా రేణుదేశాయ్‌ ఇటీవల ఓ సందర్భంలో చెప్పింది. తమ విడాకులకు కారణం కూడా 'ఆ సంబంధమే' అని రేణుదేశాయ్‌ చెప్పడం పెను సంచలనమయ్యింది. రేణుదేశాయ్‌ వ్యాఖ్యల్ని పవన్‌కళ్యాణ్‌ ఇంతవరకూ ఖండించలేదంటే, ఏంటి అర్థం.? అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు.? అంటే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చే సందర్భంలో, పవన్‌కళ్యాణ్‌ వైవాహిక జీవితంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే.

Image result for jagan

'పవన్‌ కాకుండా ఇంకెవరైనా ఆ పనిచేస్తే, బొక్కలో వేసేవారు.. అని జగన్‌ మాట్లాడటం, 'కార్లను మార్చినట్లు పెళ్ళాల్ని మార్చే వ్యక్తి విలువల గురించి మాట్లాడటమా.?' అని ప్రశ్నించడంతో పవన్‌ అభిమానులు రెచ్చిపోయారు. జనసేన తరఫునుంచి ఈ వ్యవహారంపై ఓ స్పందన వచ్చింది. ఒకరికి విడాకులు ఇచ్చాక, చట్టబద్ధంగానే ఇంకొకర్ని పవన్‌ పెళ్ళాడారనీ, రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మంచిది కాదని జనసేన వర్గాలు స్పందించాయి. మరోపక్క, పవన్‌ తాను సౌమ్యుడినని చెప్పుకుంటూనే, 'తాట తీస్తా.. తోలు వొలిచేస్తా..' అంటూ వైఎస్‌ జగన్‌కి నిన్ననే హెచ్చరికలు పంపారు. రేణుదేశాయ్‌కి ఎలాగూ పవన్‌ సమాధానం చెప్పలేదు, జగన్‌ ప్రశ్నలకైనా పవన్‌ సమాధానం చెప్పి తీరాలిప్పుడు. రాజకీయాల్లోకొచ్చాక, 'వ్యక్తిగత విషయాల జోలికి రాకూడదు' అంటే కుదరదు. 'నైతికత' ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలూ పక్కన పడేశాయి కాబట్టి, అన్ని విషయాలూ చర్చకు వస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: