పవన్ కళ్యాణ్ మీద జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. దీనితో పవన్ అభిమానులు రెచ్చి పోయి జగన్ ను , జగన్ కుటుంబ సభ్యుల మీద ఎదురు దాడి చేసినారు. దీనితో వివాదం ఇంకా పెద్దది అయ్యింది. కొన్ని చానెల్స్ అదే పనిగా వాటిని ప్రచారం చేసి లభ్ది పొందాలని చూసారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ అతని లోని పరిణితిని తెలియజేస్తాయి. ఏమన్నాడంటే... తనను జగన్ వ్యక్తిగతంగా విమర్శించడం చాలామందికి బాధ కలిగించిందని, ఇది తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.

తాను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లనని తెలిపారు. అంతేకాదు రాజకీయ లబ్ధికోసం అసలు వాడనని వినమ్రంగా తెలిపారు. ప్రజాసంబంధ పాలసీలపై మాత్రమే ఇతర పార్టీలతో విభేదిస్తానని తన రాజకీయ పంథాను ఆవిష్కరించారు. అంతేతప్ప తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టంచేశారు. తనపై విమర్శలు చేసిన జగన్‌పై గాని, అతని కుటుంబ సభ్యులపై, వారి ఆడపడుచులపై గాని విమర్శలు చేసి ఈ వివాదంలోకి లాగవద్దని అభిమానులను మనస్ఫూర్తిగా వేడుకున్నారు. అంతేకాదు ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయాలని ఆయన ప్రార్థిస్తూ ట్వీట్‌చేసి తన ఔన్నత్యాన్ని పవన్ చాటుకున్నారు.

కొందరి హృదయాలు కాలుతుంటే చలి కాచుకోవాలనుకున్న కొన్ని చానళ్లు, వార్తా పత్రికలు, రాజకీయ నాయకుల ఆశలకు జగన్ వివాదంలో ఒకేఒక్క ట్వీట్ ద్వారా పవన్ గండికొట్టారు. సినీరంగంలో రారాజుగా వెలుగొందుతున్న పవన్ కోట్లాది రూపాయల ఆదాయాన్ని కాదనుకుని మార్పుకోసం సమాజం బాటపట్టారు. ఒక్కో సమయంలో ఒక్కోరకంగా ఆయనపై జరుగుతున్న మానసిక దాడులను తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు రాటుదేలుతూ ముందుకు కదనోత్సాహంతో కదులుతున్నాడీ ఆంధ్రా చేగువేరా.
5/
5 -
(1 votes)
Add To Favourite