ఏపీ రేషన్ దుకాణాలలో బియ్యానికి మంగళం పాడేసింది బాబు సర్కారు. ఇప్పటి వరకు ఒక్క బియ్యమే ఇస్తున్నారన్న విపక్షాల విమర్శలతో ఏకంగా ఆ సరుకే మాయం చేసేసింది. బియ్యానికి బదులుగా రాగులు, జొన్నలు ఇస్తారట. ఎందుకంటే ప్రజలంతా చక్కెర  బాధితులని, బియ్యం ఎవరూ తీసుకోవడం లేదని మంత్రి ప్రతిపాటి పుల్లారావు చెబుతున్నారు.


బాబు రేషన్ పై జనాగ్రహం :


గడచిన నాలుగున్నరేళ్ళుగా చంద్రబాబు ఏలుబడిలో రేషన్ షాపులంటే సాదా జనమే పట్టించుకోని పరిస్థితి ఉంది. అక్కద బియ్యం తప్ప మరేం ఇవ్వరు, అంతకు పూర్వం తొమ్మిది సరుకులు ఇచ్చేదాన్ని  పూర్తిగా కట్ చేసారు. ఈ పాటి నిర్వాకానికి ప్రజాభిప్రాయం కోరిందట టీడీపీ సర్కార్. ముఖం మీద కొట్టినట్లుగా రేషన్ షాపుల పనితీరు దారుణమంటూ జనం ఆ సర్వేలో చెప్పారట. విశాఖలో ఈ రోజు మీడియాతో ఈ వివరాలు మంత్రి పుల్లారావే స్వయంగా చెప్పడం విశేషం.


అన్న క్యాంటీన్లు అదుర్స్ ట :


ఏపీలో అన్న క్యాంటీన్లు బాగా పనిచేస్తున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. చిన్న చిన్న తప్పులు ఉన్నా పట్టించుకోకూదదంటున్నారు. పేద వాని ఆకలి తీర్చడమే చంద్రబాబు లక్ష్యమని పెర్కొంటున్న మంత్రి మరో  203 అన్న క్యాంటీన్లు తొందరలో ఏర్పాటు చేస్తామంటున్నారు. తమ శాఖలో తప్పులుంటే చర్యలకు వెనుకాడేదే లేదని కూడా ఢంకా భజాయించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: