జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటన లో ఉన్నాడు. ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, తన అభిప్రాయాలను వారితో పంచుకుంటున్నాడు. అలాగే జగన్ చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో స్పందించాడు. అందరు బాగుండాలనే ఉద్దేశ్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఇతరులలాగా ఒళ్లు బలిసి మాట్లాడనని చెప్పారు. ఎవరి వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితి జరిగిందో ఎవరికి తెలుసునని ప్రశ్నించారు.

Image result for pavan kalyan janasena

2019 ఎన్నికలు చాలా కీలకమని పవన్ కళ్యాణ్ చెప్పారు. అరుపులు, కేకలు కాకుండా ఓట్లు నమోదు చేయించుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు. నేను బయటకు వెళ్తే పోలీసులకు భయపడతానని చెప్పారు. పోలీసులు ఆపితే కేసులు పెడతారేమోనని భయపడతామన్నారు. ఒక్కరు ఏమీ చేయలేరని, అందరం కలిస్తేనే శక్తిగా మారగలమని అన్నారు. సామాజిక, రాజకీయ వ్యవస్థను మార్చకపోతే గూండాలు, ఫ్యాక్షనిస్టులు రాజ్యమేలుతారని పవన్‌ అన్నారు. స్వార్థం లేని వారే రాజకీయాల్లో ఉండాలన్నారు. ఆడవారు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లని గాంధీ అన్నారని, కానీ నేడు ఆడపిల్లలు పగలు కూడా రోడ్లపై తిరగలేని పరిస్థితి ఉందన్నారు.

Image result for pavan kalyan janasena

2019 రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమన్నారు. అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. తుపాకీతో కాల్చేసినోళ్లు, దోపిడీలు చేసి చట్టం నుంచి తప్పించుకున్న వాళ్లు ప్రజల మీద పెత్తనం చేస్తున్నారన్నారు. దోపిడీదారులు కోట్లు సంపాదిస్తుంటే పీజీ, పీహెచ్‌డీలు చేసిన విద్యావంతులు వాళ్ల కింద పనిచేస్తున్నారన్నారు. ఇలాంటి వ్యవస్థ మారాలన్నారు. ఒక్క మాట మాట్లాడితే తెలంగాణ వాళ్లకు కోపం, మాట్లాడకపోతే ఏపీ ప్రజలు తిట్టే పరిస్థితుల్లో తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: