జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్ర పశ్చిమగోదావరి జిల్లా లో సాగుతుంది. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జనసేన పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ నిఅలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఏకిపారేశారు. ముఖ్యంగా ఈ సభలో జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Related image

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఎదుర్కొనలేక ప్రతిపక్ష పార్టీ నాయకుడు జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. అదే ప్రతిపక్ష స్థానంలో నేను ఉంటే ప్రభుత్వాన్ని ఒక ఊపు ఊపి వాడినని సంచలన కామెంట్లు చేశారు. ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుడికి ఉన్న శ‌క్తిని వాడుకోలేక పోతున్నార‌ని మాట్లాడుతుంటే నాపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

Image result for pawan at bhimavaram

పవన్ కల్యాణ్ జీవితం తెరిచిన పుస్తకం. ఏదీ దాయడు. చాలా మంది జీవితాల్లో కనిపించని పేజీలు ఉంటాయి. నా జీవితం అలా కాదు.. దాపరికాలు లేవు.. తెరిచిన పుస్తకమే’ అని పవన్ అన్నారు. నా వద్ద ఎలాంటి సీక్రెట్స్ లేవన్నారు. మీ కంటే నేను చాలా బెట్టర్ అన్నారు. వ్యక్తిగతంగా నాకు ఎవరు శత్రువు కాదని పబ్లిక్ పాలసీల గురించి ప్రశ్నలు అడుగుతున్నా అని పేర్కొన్నారు.

Related image

అయితే పవన్ చేసిన ప్రసంగం సోషల్ మీడియా లో ప్రసారమైన నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు...నిజంగా పవన్ కి పోరాట పటిమ ఉంటే ఆనాడు ప్రత్యేక హోదా కోసం వైజాగ్లో స్టూడెంట్స్ ఇంకా సామాన్యజనులు ఉద్యమం చేస్తున్నప్పుడు ఇంట్లో కూర్చుని ట్విటర్ లో పోస్టులు పెడుతున్నారు తప్ప ...బయటకు రాలేదని అన్నారు. ఆనాడు నిజంగా ప్రజల తరఫున..స్వచ్ఛందంగా ప్రజలు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపడానికి వచ్చిన ఏకైక నాయకుడు జగన్ అని పేర్కొన్నారు నెటిజన్లు.




మరింత సమాచారం తెలుసుకోండి: