పవన్ కళ్యాణ్ భీమవరం లో జరిగిన సభలో అప్పుడు ప్రజారాజ్యం పార్టీ లో జరిగిన విషయాలను ప్రజలకు వివరించారు. పవన్ మాటల ను బట్టి చూస్తుంటే ప్రజారాజ్యం పార్టీ నాయకుల పట్ల అసంతృప్తి ఉందని అర్ధం అవుతుంది. వారిని పిరికి పంద ల్లాగా మాట్లాడినాడు. పేరెత్తకుండానే ఆనాడు తనవెంట ఉన్నవాళ్లంతా పిరికిపందలు అనేశారు. కష్టాలు ఎదురైనా నిరాశ పడకుండా ముందుకు సాగాలనే మెసేజ్ ఇస్తూ ప్రజారాజ్యం ప్రచారంలో జరిగిన సంఘటనల్ని వివరించారు.

Image result for pawan janasena

కాంగ్రెస్ లో ఒక నాయకుడిని పంచలూడదీసి కొడతానంటే తర్వాతి రోజు పార్టీ ఆఫీస్ లో ఒక్కడు కూడా కనిపించలేదని, కాంగ్రెస్ వాళ్లు దాడిచేయడానికి వస్తారని భయపడి పారిపోయారని అన్నారు పవన్ కల్యాణ్. ఆనాడు తనకు అండగా నిలిచింది ఉస్మానియా విద్యార్థులని, కష్టాల్లో ఉన్నప్పుడే మనుషుల వ్యక్తిత్వాలు బయటకి వస్తాయని అన్నారు పవన్. నిజమే.. ఆనాటి ఊపులో పవన్ కల్యాణ్ కాంగ్రెస్ వాళ్ల పంచలూడదీసి కొడతామని పెద్ద పెద్ద డైలాగులే చెప్పాడు. ఆ మాటలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో ప్రజారాజ్యం నేతలే కాస్త సంయమనం పాటించారు. 

Image result for pawan janasena

అయితే దీన్ని ఇప్పుడు మరోలా చెప్పుకొచ్చారు పవన్. తన మాటల కారణంగా కాంగ్రెస్ వాళ్లు దాడిచేస్తారనే భయంతో ప్రజారాజ్యం పార్టీ నేతలు ఆ తర్వాతి రోజు ఆఫీస్ కి రాకుండా పారిపోయారని దెప్పిపొడిచారు. పవన్ చెప్పింది నిజమై ఉండొచ్చేమో. మరి అప్పుడే ఆయన ఎందుకు బైటపడలేదు, కనీసం ఆ తర్వాతయినా ఎప్పుడూ ఆ విషయాన్ని చెప్పలేదు కూడా. ఇప్పడూ ఇవన్నీ ఎందుకు చెబుతున్నట్టో అయితే ఒక విషయం మాత్రం మనకు పూర్తిగా అర్ధం అవుతుంది. ప్రజారాజ్యం పార్టీ విషయం లో పవన్ భాద పడ్డాడని..!

మరింత సమాచారం తెలుసుకోండి: